...
...
Next Story

అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్ మధ్య వీక్లీ 2 విమాన సర్వీసులు.. ఫ్లైట్ టికెట్ ధర ఎంత?

Bhogapuram-Bangkok Flights : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. భోగాపురం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి కోసం రెండు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది.

Updated on: Sep 9, 2026, 14:11:01 IST
Advertisement

అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు విమాన సర్వీసును ప్రారంభించనుంది. ఈ ప్రాంతానికి ఇది ఒక కీలక మలుపు అని విమాన ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అక్టోబర్ 27న ఈ సర్వీసు ప్రారంభం అవుతుంది.

భోగాపురం-బ్యాంకాక్ ఫ్లైట్ సర్వీస్
భోగాపురం-బ్యాంకాక్ ఫ్లైట్ సర్వీస్

సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితంగా ఆ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భోగాపురాన్ని బ్యాంకాక్‌తో కలుపుతూ నేరుగా సర్వీసులను నడపనుంది. పెద్ద ఫార్మాస్యూటికల్ రంగం, ఒక ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ.. విశాఖపట్నానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు అందుకోవడానికి ప్రయాణికులు, వ్యాపార ప్రతినిధులు సాధారణంగా హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ లాంటి వాటిపై ఆధారపడవలసి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. విశాఖపట్నాన్ని థాయిలాండ్ రాజధానితో అనుసంధానించడం ద్వారా ఈ మార్గం పలు ఆర్థిక రంగాలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

విడుదలైన విమాన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు ఈ సర్వీసును నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకాక్‌లో దిగుతుంది. తిరుగు ప్రయాణ విమానం, IX 903 బుధవారాలు, శనివారాలు తెల్లవారుజామున బ్యాంకాక్ కాలమాన ప్రకారం.. 2.10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, భారత కాలమాన ప్రకారం.. తెల్లవారుజామున 3.55 గంటలకు విశాఖపట్నంలో చేరుకుంటుంది. ప్రారంభ వన్-వే ఎకానమీ ఛార్జీలు రూ.16,300 నుండి రూ.19,400 మధ్య ఉండటంతో, ఈ ఫ్లైట్స్ వారాంతపు విహార యాత్రికులకు, కార్పొరేట్ ప్రయాణికులకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్ 27 సమీపిస్తున్న తరుణంలో భోగాపురం నుండి నడవనున్న అంతర్జాతీయ విమాన సర్వీసు ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. విశాఖపట్నం ఇకపై కేవలం ఒక ప్రాంతీయ స్థాయి కేంద్రం మాత్రమే కాదు.. ప్రపంచ విమానయాన చిత్రపటంలో పేరు సంపాదించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks