ఏపీలో వంద రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, నెడ్ క్యాప్ వీసీఎండీ కమలాకర్ బాబు, పీఎం సూర్యఘర్ కాంట్రాక్టర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువు లోపు పీఎం సూర్యఘర్ పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న మూడు నెలల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేసే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో పీఎం సూర్యఘర్ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా గుత్తేదారులు పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.
ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి అన్నిస్థాయిలలో నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం ప్రాముఖ్యతను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నొక్కి చెప్పారు. పీఎం సూర్య ఘర్ పథకం విజయవంతమైన అమలు, సమ్మిళిత, సుస్థిర ఇంధన లభ్యత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు చేయాలని, కాంట్రాక్టర్లు తమ బాధ్యతలను నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తించేలా చూడాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. అమలులో ఎలాంటి లోపాలను సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు సమాన ప్రయోజనాలు అందేలా చూస్తూ, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సోలార్ విద్యుత్ సంక్షోభం: భారీ ధరతో కొనుగోలు.. కారుచౌకగా అమ్మకం! డిస్కంల ఖజానాకు 'కరెంట్' షాక్
దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఊపిరాడని స్థితిని ఎదుర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎక్కువ ధరకు సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న డిస్కంలు, డిమాండ్ లేక ఎక్స్ఛేంజీల్లో అతి తక్కువ ధరకే వాటిని విక్రయిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
{{/usCountry}}దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్నా, క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఊపిరాడని స్థితిని ఎదుర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎక్కువ ధరకు సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న డిస్కంలు, డిమాండ్ లేక ఎక్స్ఛేంజీల్లో అతి తక్కువ ధరకే వాటిని విక్రయిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
{{/usCountry}}