ఏపీలో వార్షిక 61 రోజుల చేపల వేట నిషేధం జూన్ 15తో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత గ్రామాల్లో ఒకరకమైన ఉత్సాహం నెలకొంది. అక్కడి మత్స్యకారులు కొత్త సీజన్ కోసం తమ పడవలను, వలలను సిద్ధం చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. రాబోయే నెలల్లో అనుకూలమైన వాతావరణం, చేపలను అధికంగా పట్టడం, మెరుగైన ఆదాయాలపై మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు.

సముద్ర జీవుల సంతానోత్పత్తి, చేపల సంపద పరిరక్షణ కోసం వీలు కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు విధించే ఈ నిషేధం, వేలాది మంది మత్స్యకారులను దాదాపు రెండు నెలల పాటు ఒడ్డునే ఉంచింది. ఈ ఆంక్షను ఎత్తివేయనున్న నేపథ్యంలో మత్స్య రేవులలో, గ్రామాలలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అక్కడ మత్స్యకారులు పడవలకు మరమ్మతులు చేయడం, వలలను బాగుచేయడం, అలాగే తమ ప్రయాణానికి అవసరమైన కొత్త పరికరాలు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువులను సమకూర్చుకునే పనిలో పడ్డారు.
చాలా మంది జాలర్లు తరతరాల సంప్రదాయాలను కూడా ఫాలో అవుతుంటారు. సాధారణంగా సముద్రంలోకి వెళ్లే ముందు పూజారులను సంప్రదించి, శుభ ముహూర్తాన్ని చూసుకుంటారు.
నిషేధ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సేవలో పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. సుమారు 1.30 లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున, మొత్తం రూ. 261.5 కోట్లతో ఆదుకుంది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత చేపల వేట పునఃప్రారంభం కావడంతో తాజా సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు మార్కెట్లకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే మెుదట్లో పరిమిత లభ్యత, అధిక డిమాండ్ కారణంగా తొలి వారాల్లో సముద్రపు చేపల ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. తాజా చేపలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఓడరేవులు, చేపల ల్యాండింగ్ కేంద్రాలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
చేపల వేట కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం వల్ల చేపల మార్కెట్లు, అనుబంధ రంగాలు పునరుజ్జీవం పొందనున్నాయి. తద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వేలాది మంది ప్రజలకు జీవనోపాధి పునరుద్ధరించబడుతుంది.
{{/usCountry}}చేపల వేట కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం వల్ల చేపల మార్కెట్లు, అనుబంధ రంగాలు పునరుజ్జీవం పొందనున్నాయి. తద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన వేలాది మంది ప్రజలకు జీవనోపాధి పునరుద్ధరించబడుతుంది.
{{/usCountry}}మరోవైపు ఎప్పుడూ మత్స్యకారులు, చేపలతో సందడి సందడిగా కనిపించే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రస్తుతం సందడి లేకుండా ఉన్నది. రోజూ వందలాది బోట్ల రాకపోకలతో బాగుండే జెట్టీ, గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పుడు జూన్ 15 నుంచి ఇక మళ్లీ సందడి మెుదలుకానుంది. దీంతో మత్స్యకారులు ఉత్సహంగా ఉన్నారు.