...
...
Next Story

ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు.. హైదరాబాదీ అత్తరు వ్యాపారుల విచారణలో షాకింగ్ విషయాలు

ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సాదిక్ వచ్చి తమ దగ్గర సైనైడ్ తీసుకెళ్లినట్టుగా అత్తరు వ్యాపారులు వెల్లడించారు.

Published on: Sep 10, 2026, 07:19:18 IST
Advertisement

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్(AE) నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాదిక్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సాదిక్‌కు విషపూరితమైన ద్రావణాలను విక్రయించిన హైదరాబాద్‌కు చెందిన అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్‌లను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు విచారించారు.

ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు
ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు

పోలీసుల విచారణలో అత్తరు వ్యాపారులు రెహమాన్, అబ్దుల్ ఖాదీర్ సంచలన వివరాలు వెల్లడించారు. సాదిక్ ఖాన్ తమ వద్దకు వచ్చి అత్యంత విషపూరితమైన లిక్విడ్ కావాలని కోరినట్లు తెలిపారు. మొదట అతడికి థాయ్ పొటాషియం ఇచ్చినట్లు వ్యాపారులు చెప్పారు. ఇది ఎందుకు అని ప్రశ్నించగా, తాను రైఫిల్ షూటర్‌నని, కొంత పని ఉందంటూ నమ్మబలికాడని పేర్కొన్నారు.

థాయ్ పొటాషియంను ఆహార రూపంలో ఎవరికైనా ఇస్తే, అది శరీర అవయవాల్లోకి నెమ్మదిగా చేరి ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తుందని విచారణలో వెల్లడించారు. అనంతరం ఇచ్చిన పొటాషియం సైనైడ్ మిక్సింగ్ లిక్విడ్ మనుషుల ప్రాణాలను తక్షణమే బలి తీసుకునేంత ప్రమాదకరమైనదని వ్యాపారులు విచారణలో తేలింది.

కస్టడీలో ఉన్న సాదిక్ ఖాన్‌ను అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్, సీఐ ప్రకాష్, ఇద్దరు ఎస్ఐల బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 70కి పైగా ప్రశ్నలు సంధించినా అతడు ఎక్కడా భయం లేదా బెరుకు లేకుండా మౌనంగానే ఉండిపోయాడని సమాచారం. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డికి, సాదిక్‌కు మధ్య గొడవ ఎందుకు జరిగింది? జగదీశ్వరరెడ్డికి సైనైడ్ కలిపిన ప్రోటీన్ డ్రింక్ ఇచ్చి చంపారా? నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య సూసైడ్ నోట్‌లో సాదిక్ పేరే ఎందుకు రాశారు? లాంటి ప్రశ్నలు వేశారని తెలుస్తోంది.

మరోవైపు నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం బయటకి వచ్చింది. సాదిక్ ఖాన్ విద్యాభ్యాసం, రైఫిల్ షూటింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలించగా.., అవన్నీ నకిలీవని స్పష్టమైంది. అతడికి ఎలాంటి సరైన విద్యా అర్హతలు లేదా గుర్తింపు పొందిన రైఫిల్ షూటింగ్ ధ్రువీకరణలు లేవని విచారణలో నిర్ధారణకు వచ్చారు.

ఆగస్టు 16న నూకరాజు, ఆయన భార్య మీన, కుమార్తె సౌజన్య తమ 10 ఏళ్ల మనవడితో కలిసి గోదావరి నదిలోకి దూకారు. ఈ ఘటనలో బాలుడు ఈత వచ్చి ప్రాణాలతో బయటపడగా, మిగిలిన ముగ్గురు మృతి చెందారు. సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా.. సాదిక్ ఖాన్ తమను మానసికంగా వేధించాడని, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చాడని, అలాగే తన భర్త జగదీశ్వరరెడ్డిని కూడా విషమిచ్చి హత్య చేశాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ వేగవంతం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks