‘అర్నబ్’ తుఫాన్ విలయం - విశాఖ, విజయవాడ విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక అలర్ట్
అర్నబ్ తీవ్ర తుపాను కారణంగా విశాఖపట్నం, విజయవాడ విమాన రాకపోకలకు ఆటంకం కలగవచ్చని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. తీరం దాటే సమయంలో గంటకు 140 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తీవ్ర తుపాను వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అత్యంత కీలకమైన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. తుపాను ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల నుంచి నడిచే విమాన సర్వీసులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు తమ విమాన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఎయిర్ ఇండియా అలర్ట్…
సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎయిర్ ఇండియా తమ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. "అర్నబ్ తీవ్ర తుపాను కారణంతో అక్టోబర్ 27న విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. విమాన ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ఈ సమయంలో రహదారి ప్రయాణాలు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించుకుని ముందుగానే బయలుదేరడం శ్రేయస్కరం. ఈ విపత్తు సమయంలో ప్రయాణికుల సహకారాన్ని కోరుతున్నాం," అని ఎయిర్ ఇండియా ప్రకటనలో పేర్కొంది.
భారత వాతావరణ శాఖ (IMD), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అందించిన తాజా సమాచారం ప్రకారం.. అర్నబ్ తుపాను గడిచిన కొన్ని గంటలుగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది బాపట్ల - విశాఖపట్నం మధ్య ఉన్న యానాం సమీపంలో బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నానికి 300 కిలోమీటర్లు, కాకినాడకు 360 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 460 కిలోమీటర్లు, బాపట్లకు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తీవ్ర తుపాన్ తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గాలి వేగం గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు వెళ్లే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో అత్యంత భారీ నుంచి తీవ్ర తుపాను వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాలు, 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 పట్టణ ప్రాంతాలు ఈ తుఫాన్ మార్గంలో నేరుగా ప్రభావితం కానున్నాయి.
- రాష్ట్ర వ్యాప్తంగా 1,763 తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
- జిల్లా, మండల స్థాయిలలో సమాచారం కోసం 2,907 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
- క్షేత్రస్థాయి సహాయక చర్యలను పర్యవేక్షించడానికి 3,185 మంది నోడల్ అధికారులను నియమించారు.
- ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 2,107 స్వర్ణ గ్రామా, స్వర్ణ వార్డు యూనిట్లను రంగంలోకి దించారు.
- అత్యంత ముప్పు ఉన్న 11 జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలు ఇప్పటికే మోహరించాయి.
- ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, స్థానిక అధికారుల ఆదేశాలను తప్పక పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

