భోగాపురం-న్యూఢిల్లీ మధ్య అక్టోబర్ 25, 2026 నుండి ఆకాశ ఎయిర్ (Akasa Air) ఒక కొత్త విమాన సర్వీసు నడపనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఈ విమానం న్యూఢిల్లీ నుండి ఉదయం 5:55 గంటలకు బయలుదేరి, ఉదయం 8:20 గంటలకు భోగాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది భోగాపురం నుండి ఉదయం 9:05 గంటలకు బయలుదేరి ఉదయం 11:30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి వివిధ ప్రాంతాలకు మరిన్ని విమానాలను నడిపేందుకు అనేక విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ అదనపు విమాన సర్వీసు ఉత్తరాంధ్ర ప్రాంతం, న్యూఢిల్లీకి చెందిన ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్
అక్టోబర్ 27 నుంచి భోగాపురం-బ్యాంకాక్ మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు విమాన సర్వీసును ప్రారంభించనుంది. ఈ ప్రాంతానికి ఇది ఒక కీలక మలుపు అని విమాన ప్రయాణికులు అభివర్ణిస్తున్నారు. భోగపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అక్టోబర్ 27న ఈ సర్వీసు ప్రారంభం అవుతుంది.
సంవత్సరాల తరబడి చేసిన కృషి ఫలితంగా ఆ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భోగాపురాన్ని బ్యాంకాక్‌తో కలుపుతూ నేరుగా సర్వీసులను నడపనుంది. పెద్ద ఫార్మాస్యూటికల్ రంగం, ఒక ప్రధాన ఓడరేవు, అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లు, సముద్రపు ఆహార ఎగుమతి మార్కెట్ ఉన్నప్పటికీ.. విశాఖపట్నానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్లు అందుకోవడానికి ప్రయాణికులు, వ్యాపార ప్రతినిధులు సాధారణంగా హైదరాబాద్, చెన్నై లేదా న్యూఢిల్లీ లాంటి వాటిపై ఆధారపడవలసి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. విశాఖపట్నాన్ని థాయిలాండ్ రాజధానితో అనుసంధానించడం ద్వారా ఈ మార్గం పలు ఆర్థిక రంగాలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా ఈ సర్వీసు ప్రారంభమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల. విశాఖపట్నాన్ని థాయిలాండ్ రాజధానితో అనుసంధానించడం ద్వారా ఈ మార్గం పలు ఆర్థిక రంగాలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
{{/usCountry}}విడుదలైన విమాన షెడ్యూల్ ప్రకారం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వారానికి రెండుసార్లు ఈ సర్వీసును నడుపుతుంది. ఫ్లైట్ IX 904 ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకాక్‌లో దిగుతుంది. తిరుగు ప్రయాణ విమానం, IX 903 బుధవారాలు, శనివారాలు తెల్లవారుజామున బ్యాంకాక్ కాలమాన ప్రకారం.. 2.10 గంటలకు బ్యాంకాక్ నుండి బయలుదేరి, భారత కాలమాన ప్రకారం.. తెల్లవారుజామున 3.55 గంటలకు విశాఖపట్నంలో చేరుకుంటుంది. ప్రారంభ వన్-వే ఎకానమీ ఛార్జీలు రూ.16,300 నుండి రూ.19,400 మధ్య ఉండటంతో, ఈ ఫ్లైట్స్ వారాంతపు విహార యాత్రికులకు, కార్పొరేట్ ప్రయాణికులకు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.