...
...
Next Story

AP Municipal Elections Polling : మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం - ఉదయం 7 గంటల నుంచి పోలింగ్..! సీసీ నిఘాలో కేంద్రాలు

AP Municipal Elections Polling : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 92 పట్టణ స్థానిక సంస్థల్లో 99.36 లక్షల మంది ఓటర్లు హక్కు వినియోగించుకోనుండగా, 36,351 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.

Published on: Nov 1, 2026, 04:40:37 IST
Advertisement

AP Municipal Elections Polling : ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక పోరుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొనేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగం భారీ చర్యలు చేపట్టింది.

ఏపీలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం (AI Image)
ఏపీలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం (AI Image)

మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. వీటిలో 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలు ఉన్నాయి. మొదట రాష్ట్ర వ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా…. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు మరియు ఏకగ్రీవాల ప్రక్రియ ముగిసేసరికి బరిలో 6,669 మంది అభ్యర్థులు నిలిచారు.

షెడ్యూల్‌ ప్రకటించిన 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 17 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 8 మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ అవసరం లేకుండా పోయింది. మిగిలిన చోట్ల ఎక్కువ సంఖ్యలో వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన కొన్ని వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, దర్శి, ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, ఆళ్లగడ్డ పురపాలికలు, నగర పంచాయతీల్లో పాలకవర్గాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి,

11,805 పోలింగ్‌ కేంద్రాలు…

ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,382 స్థానాలకు 11,805 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటి పరిధిలో 99,36,014 మంది పౌరులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కార్పొరేషన్ల పరిధిలోనే 59,97,918 మంది ఓటర్ల కోసం 6,384 పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలను కల్పించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నెట్‌వర్క్, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది.

ఎన్నికల బందోబస్తులో భాగంగా పులివెందులలో డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు వజ్ర వాహనంతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి పూల అంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్ మీదుగా ఈ కవాతు సాగింది. భద్రతా ఏర్పాట్లను డీఐజీ కోయా ప్రవీణ్ స్వయంగా సమీక్షించారు. పులివెందులలో ఇప్పటికే 700 మంది పోలీసులను మోహరించడంతో పాటు సమస్యాత్మక మూలాలు ఉన్న 1000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks