జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్-2026 జిల్లా స్థాయి పోటీలు, ఎంపిక ప్రక్రియ ఈ నెల 14న విశాఖపట్నంలో జరగనుంది. కొమ్మాదిలోని శాప్ (SAAP) ఇంటీగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఆర్. జూన్ గాలియట్ తెలిపారు.

హాకీ దిగ్గజం, భారతరత్న ద్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఛాంపియన్‌షిప్‌ను రూపొందించారు.
ఈ జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. గత జూలై 27 నుండి 31 వరకు జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. నియోజకవర్గ స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నెల 14న జరిగే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనడానికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.
క్రీడాకారుల ఆసక్తిని, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 12 రకాల క్రీడా విభాగాలలో ఈ పోటీలు నిర్వహించనున్నారు: ఆర్చరీ (విలువిద్య), అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా పోటీలు ఉంటాయి.
ఈ పోటీలను అండర్-17, అండర్-23 కేటగిరీలలో బాలురు, బాలికలకు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొనే అభ్యర్థులు తమ వెంట కొన్ని విధిగా తీసుకరావాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, విద్యార్హత / చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (వివరాలు స్పష్టంగా ఉండేలా) తీసుకురావాలి.
వెరిఫికేషన్ నిమిత్తం ఈ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని క్రీడాధికారులు వెల్లడించారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు తదనంతరం జరగబోయే రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోరింది.
{{/usCountry}}వెరిఫికేషన్ నిమిత్తం ఈ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని క్రీడాధికారులు వెల్లడించారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు తదనంతరం జరగబోయే రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందుతారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోరింది.
{{/usCountry}}