తుళ్లూరు మండలం వడ్లమాను గ్రామంలో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను అధికారికంగా మంత్రి నారాయణ ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా సముదాయంతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

'రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ ఉపశమనం కోసం స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేను మాట్లాడాను. ఆయన ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. జనవరి 6 వరకు అర్హత కలిగిన రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తాం. ఈ ప్రయోజనం రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు వర్తిస్తుంది.' అని మంత్రి నారాయణ ప్రకటించారు.
అమరావతిలో రెండో విడత భూసేకరణ ప్రక్రియను ప్రారంభమైంది. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 34వేల ఎకరాల భూమిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 4026 అధికారుల భవనాల నిర్మాణంలో వేగం పుంజుకుంది. 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు పనులు నిర్ణయించుకున్న గడువులోపు పూర్తి చేసే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది.
రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కోసం 7 గ్రామాల్లో దశలవారీగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అనంతరం ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తారు. వీటిలో ముఖ్యంగా రెండు వరుసల రహదారులు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ తదితర ఏర్పాట్లు చేస్తారు.
వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097.56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు.
{{/usCountry}}వడ్డమాను, హరిచంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల పరిధిలోని 9097.56 ఎకరాల పట్టాభూమి, 7.01ఎకరాల అసైన్డ్ భూమి, అదేవిధంగా పల్నాడు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మొత్తం 7465 ఎకరాలు పట్టా భూమి, 97 ఎకరాల అసైన్డ్ మొత్తంగా 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు.
{{/usCountry}}రైతులకు ఇచ్చే ప్లాట్లు, మౌలిక వసతుల కల్పన తదుపరి మిగిలిన 2500 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్‌కు వినియోగిస్తారు. ప్రస్తుతం వైకుంఠపురం, పెద్దమద్దూరు, యండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో నోటిపికేషన్ ప్రకటించారు. ఈ నాలుగు గ్రామాల్లో 9500 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంది. రైతులకు చెందిన భూమి 7500 ఎకరాలు ఉంది.