Royal Enfield Andhra Pradesh Investment : ఏపీ పారిశ్రామిక రంగంలో మరో భారీ పెట్టుబడి రానుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ 'రాయల్ ఎన్‌ఫీల్డ్' తన నూతన తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐషర్ మోటార్స్ యాజమాన్యంలోని ఈ సంస్థ… తిరుపతి జిల్లా సత్యవేడులో సుమారు రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు వెండార్ పార్కును నిర్మించనుంది.
భారీగానే ఉద్యోగ, ఉపాధి వకాశాలు…

తమిళనాడు వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్ చేపడుతున్న మొట్టమొదటి భారీ విస్తరణ ప్రాజెక్ట్ ఇదే కావటం విశేషం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. బుధవారం రాత్రి విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం….. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లోని సత్యవేడు మండలం వనెల్లూరు - రాళ్లకుప్పం గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి ఈ కొత్త ప్లాంట్ సుమారు తొమ్మిది లక్షల యూనిట్లను అదనంగా చేర్చనుంది. ఇది ప్రపంచ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కేంద్రంగా భారత దేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది.
కేవలం బైకుల తయారీ యూనిట్ మాత్రమే కాకుండా….. ఒక ప్రత్యేక 'వెండార్ పార్క్'ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తాయి. తద్వారా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక పటిష్టమైన ఆటోమొబైల్ క్లస్టర్ రూపుదిద్దుకోనుంది.
రెండు దశల్లో ప్రాజెక్ట్ పూర్తి
ఈ మెగా ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ పనులను 2029 నాటికి పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు.ఇక రెండో దశను 2032 నాటికి పూర్తి చేస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థ ఏపీని ఎంచుకోవడం రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలకు, మౌలిక సదుపాయాల నాణ్యతకు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.
{{/usCountry}}ఈ మెగా ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ పనులను 2029 నాటికి పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు.ఇక రెండో దశను 2032 నాటికి పూర్తి చేస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థ ఏపీని ఎంచుకోవడం రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలకు, మౌలిక సదుపాయాల నాణ్యతకు నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.
{{/usCountry}}రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన మరియు సరళమైన పారిశ్రామిక విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ రాకతో రాయలసీమ ప్రాంత పారిశ్రామిక ముఖచిత్రం మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.