Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ మాస్టర్ ప్లాన్- 350సీసీ నుంచి 750సీసీ వరకు.. ఎలక్ట్రిక్ బైక్స్‌తో కొత్త శకం!
Royal Enfield upcoming bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి పండగే! 350సీసీ నుంచి 750సీసీ వరకు ప్రతి సెగ్మెంట్లోనూ ఒక కొత్త బైక్‌ని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న మోడల్స్‌కి చౌకైన వర్షెన్లను సైతం తీసుకొస్తోంది. అంతేకాదు కొత్త ఎలక్ట్రిక్ బైక్ మీద కూడా పనిచేస్తోంది.
Royal Enfield : ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాబోయే రోజుల్లో భారత మార్కెట్‌ను ఊపేసేందుకు సిద్ధమైంది! కేవలం ఒకటో రెండో మోడళ్లు కాకుండా, ఏకంగా 350సీసీ నుంచి 750సీసీ సామర్థ్యం గల ఇంజన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి (ఈవీ) కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. అడ్వెంచర్ ప్రియుల కోసం హిమాలయన్ 440 నుంచి క్లాసిక్ లవర్స్ కోసం బుల్లెట్ 650 వరకు సరికొత్త బైకుల లైనప్‌ను సిద్ధం చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా ప్రతి కేటగిరీలోనూ కొత్త ప్రయోగాలకు తెరలేపింది. ముఖ్యంగా బడ్జెట్ అడ్వెంచర్ బైకుల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు ఈ ప్లాన్‌లో ఉన్నాయి.
హిమాలయన్ 440: సామాన్యుడికి అందుబాటులో అడ్వెంచర్!
ప్రస్తుతం ఉన్న హిమాలయన్ 450 ధర కొంత ఎక్కువ కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా హిమాలయన్ 440ను కంపెనీ తీసుకువస్తోంది. ఇది త్వరలో రానున్న ‘స్క్రామ్ 440’ ఆధారంగా రూపొందుతోంది. దీని ధర సుమారు రూ. 2.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. తక్కువ ఖర్చుతో అడ్వెంచర్ లుక్, ప్రాక్టికాలిటీ కోరుకునే రైడర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. అలాగే 450సీసీ ప్లాట్‌ఫామ్‌పై 2027లో ఒక పక్కా 'స్క్రాంబ్లర్' మోడల్ కూడా రానుంది.
బుల్లెట్ 650: పాత స్టైల్.. కొత్త పవర్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో 'బుల్లెట్'కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే ఐకానిక్ లుక్‌ను 650సీసీ ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో కలపబోతున్నారు. ఈ బుల్లెట్ 650ని గతేడాది ఈఐసీఎంఏ 2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు.
ఇది 47 బీహెచ్పీ పవర్, 52 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
750సీసీ ఫ్లాగ్‌షిప్ ప్లాట్‌ఫామ్: సరికొత్త సంచలనం!
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు మరింత శక్తివంతమైన 750సీసీ ప్లాట్‌ఫామ్‌పై పని చేస్తోంది. ఇందులో భాగంగా ‘బిగ్ హిమాలయన్’, పెద్ద వెర్షన్ 'కాంటినెంటల్ జీటీ' బైక్స్ మార్కెట్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియం టూరింగ్ కేటగిరీలో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ ఫ్లాగ్‌షిప్ మోడళ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత 650సీసీ మోడళ్లకు కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, మెరుగైన సస్పెన్షన్ వంటి అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.
ఫ్లయింగ్ ఫ్లీ: ఎలక్ట్రిక్ రంగంలోకి ఎంట్రీ!
ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే ‘ఫ్లయింగ్ ఫ్లీ’ సబ్-బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇందులో మొదటి మోడల్ సీ6 ఇప్పటికే ఆవిష్కృతం కాగా, దీనికి కొనసాగింపుగా ఎస్6 ఎలక్ట్రిక్ రాబోతోంది.
ఎస్6 మోడల్ స్క్రాంబ్లర్ స్టైలింగ్‌తో, డ్యూయల్ పర్పస్ టైర్లతో రానుంది.
అంతేకాకుండా, కంపెనీ ఎలక్ట్రిక్ హిమాలయన్పై కూడా పరీక్షలు నిర్వహిస్తోంది. అంటే భవిష్యత్తులో అడ్వెంచర్ బైకులు కూడా ఈవీ రూపంలో అందుబాటులోకి రానున్నాయి!
వీటి లాంచ్‌లు, ధరలు ఈవీల రేంజ్‌లపై కీలక వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


