AP Hotel Menu Rates : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడిపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల పెరుగుదల సెగ విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్‌లోని హోటల్ పరిశ్రమకు గట్టిగా తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే (19 కిలోల) గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

శుక్రవారం (మే 1) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం.. హైదరాబాద్ వంటి నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.993 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఒక సిలిండర్ ధర దాదాపు రూ.3,315 కు చేరుకుంది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గ్యాస్ ధరలు సుమారు రూ.1,303 మేర పెరగడం ఆతిథ్య రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులే కాకుండా….. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న వారు కూడా అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.
10 శాతం పెంపు….
"మే 1 నుంచి సిలిండర్ ధర భారీగా పెరగడం హోటల్, రెస్టారెంట్ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. ముడి పదార్థాల ఖర్చులు విపరీతంగా పెరగడంతో యజమానులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అందుకే మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని నిర్ణయించాం" అని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ వీ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం గ్యాస్ ధరలే కాకుండా, హోటల్ నిర్వహణకు కీలకమైన వంట నూనెలు, పప్పుధాన్యాలు, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఖర్చు పెరగడం వల్ల టేక్ అవే మరియు డెలివరీ సర్వీసులు భారంగా మారాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే ధరల పెంపు తప్పనిసరి అని హోటల్ యజమానులు వాదిస్తున్నారు.
{{/usCountry}}ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనె ధరలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఖర్చు పెరగడం వల్ల టేక్ అవే మరియు డెలివరీ సర్వీసులు భారంగా మారాయి. రోజువారీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే ధరల పెంపు తప్పనిసరి అని హోటల్ యజమానులు వాదిస్తున్నారు.
{{/usCountry}}ప్రస్తుత సంక్షోభం నుండి ఆతిథ్య రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ కోరింది. పన్ను రాయితీలు లేదా సబ్సిడీలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. అలాగే….. పెరిగిన ధరల పట్ల వినియోగదారులు సహకరించాలని, నాణ్యమైన సేవలను అందించడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కస్టమర్లను తెలిపింది.