విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఒక తెలుగు యువకుడు దారుణ మోసానికి గురయ్యాడు. పండ్లను ప్యాకింగ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఏజెంట్లు…. అతడిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్పించి ఉక్రెయిన్ యుద్ద ప్రాంగణానికి పంపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితుడిని విశాఖపట్నానికి చెందిన జె. వంశీగా గుర్తించారు. తన కుమారుడు యుద్ధ భూమిలో ప్రాణభయంతో అల్లాడుతున్నాడని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని అతడిని సురక్షితంగా భారతదేశానికి రప్పించాలని అతడి తల్లి జె. అప్పలకొండ కన్నీరుమున్నీరవుతోంది.
మోసం జరిగిందిలా..

విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అప్పలకొండ తన ఆవేదనను పంచుకున్నారు. "నా కుమారుడు వంశీ పండ్ల ప్యాకింగ్ కంపెనీలో పనిచేసేందుకు రష్యా వెళ్లాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత చెప్పిన ఉద్యోగం దొరకలేదు. ఆ సమయంలోనే ఒక నేపాల్‌కు చెందిన ఏజెంట్ పరిచయమయ్యాడు. ఉక్రెయిన్‌లో సైన్యానికి సంబంధించిన ఆహార పదార్థాల ప్యాకింగ్ విభాగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. ఆ మాటలు నమ్మి వెళ్లిన నా కొడుకును ఏజెంట్ దారుణంగా మోసం చేసి, నేరుగా రష్యా ఆర్మీలో చేర్పించాడు," అని ఆమె తెలిపారు.
బాధిత తల్లి అప్పలకొండ తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తీవ్రంగా చలించిపోయారు. "నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నా భర్త ఇప్పటికే మరణించారు. కుటుంబానికి ఆధారమైన నా కొడుకు తిరిగి వస్తే చాలు, నాకు ఇంకేమీ వద్దు," అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
"ఇవే మా చివరి మాటలు కావొచ్చు" — బాధితుల వీడియో కలకలం
మరోవైపు…. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం నుంచి వంశీతో పాటు మరో నలుగురు భారతీయ యువకులు చిత్రీకరించిన ఒక వీడియో సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియోలో వంశీ మాట్లాడే దృశ్యాలు కనిపించాయి. తమను దారుణంగా మోసగించి రష్యా సైన్యంలో చేర్పించారని, ప్రస్తుతం తమను యుద్ధ ముఖ ద్వారమైన సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
{{/usCountry}}మరోవైపు…. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం నుంచి వంశీతో పాటు మరో నలుగురు భారతీయ యువకులు చిత్రీకరించిన ఒక వీడియో సందేశం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియోలో వంశీ మాట్లాడే దృశ్యాలు కనిపించాయి. తమను దారుణంగా మోసగించి రష్యా సైన్యంలో చేర్పించారని, ప్రస్తుతం తమను యుద్ధ ముఖ ద్వారమైన సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
{{/usCountry}}"రష్యాలో మాకు పరిచయమైన ఒక నేపాలీ ఏజెంట్, ఆర్మీలో ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఈ ఉచ్చులోకి లాగాడు. రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై మా చేత సంతకాలు చేయించుకున్నారు. ఆ భాష మాకు రాకపోవడంతో అందులో ఏముందో అర్థం కాలేదు. తర్వాత విచారించగా…. మాకు భారత పౌరసత్వం రద్దయి రష్యా పౌరసత్వం వచ్చినట్లు చెప్పారు. భారత పౌరసత్వం గురించి మేము అడిగినప్పుడల్లా 'మీరు ఇక భారతీయులు కాదు, రష్యన్ పౌరులు' అని అధికారులంటున్నారు. మాకు రష్యా పౌరసత్వం వద్దు, మా భారత పౌరసత్వమే మాకు కావాలి. ఈ విషయం ముందే తెలిస్తే మేము దేనికి అంగీకరించేవాళ్లం కాదు," అని వంశీ తీవ్ర ఆందోళనతో పేర్కొన్నాడు.
వీడియో ముగింపులో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "మమ్మల్ని నేరుగా యుద్ధ రంగానికి పంపుతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇవే మా చివరి మాటలు కావచ్చు. భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మా ప్రాణాలను కాపాడి స్వదేశానికి తీసుకెళ్లాలి," అని వారు వేడుకున్నారు.
బాధిత కుటుంబం విజ్ఞప్తిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "విదేశాల్లో చిక్కుకున్న మన పౌరుల దుస్థితి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ విషయంలో సంబంధిత అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకుని, వారిని సురక్షితంగా మరియు వేగంగా స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నా కార్యాలయాన్ని ఆదేశించాను" అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.