AP Assembly Special Meeting: ఈనెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - రాజధానిగా అమరావతిపై తీర్మానం...!
ఈ నెల 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీకి అమరావతి రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఆపై తీర్మానం కాపీని కేంద్రానికి పంపనున్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి…. రాజధానిగా అమరావతిని ఖరారు చేయనుంది. న్యాయపరమైన చిక్కులకు ఈ తీర్మానంతో శాశ్వత పరిష్కారం లభించాలని సర్కార్ భావిస్తోంది.

అమరావతిపై తీర్మానం….!
ఏకైక అజెండాతో నిర్వహించే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిపై తీర్మానం చేస్తారు. అంతేకాదు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఫలితంగా రాజధాని మార్పు విషయంలో ఎలాంటి సందిగ్ధత, ప్రయత్నాలు ఉండకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నది పార్లమెంట్ రికార్డుల్లో స్పష్టంగా ఉండేలా చూడటమే ఏపీ సర్కార్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. తీర్మానం తర్వాత… విభజన చట్టంలో కూడా ఏపీ రాజధాని అమరావతి అనే విషయాన్ని స్పష్టంగా పొందుపర్చిలే సవరణ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఫలితంగా అమరావతికి కేవలం రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా…. దేశ అత్యున్నత చట్టసభ ద్వారా కూడా రాజ్యాంగబద్ధమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది.
మరోవైపు కూటమి ప్రభుత్వం… అమరావతిపై చాలా ఫోకస్ చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పనులను వేగవంతం చేస్తోంది. గతంలోని ప్రాజెక్టులను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులను రాబట్టే పనిలో ఉంది. ఐకానిక్ భవనాలు, రోడ్ల నెట్‌వర్క్ వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగేందుకు మార్గం సుగమమవుతుంది. సీఎం చంద్రబాబు కూడా… అమరావతి పనులపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

