AP PACS Elections : సహకార ఎన్నికలకు కసరత్తు - ఒకే విడతలో….!

సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Published on: Nov 9, 2026, 11:33:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (పీఏసీఎస్) వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఒకే విడతలో పోలింగ్…!

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ విడతలవారీగా కాకుండా, ఒకే విడతలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధారణంగా సహకార ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనాపరమైన చిక్కులను అధిగమించడానికి ఒకేసారి పోలింగ్ నిర్వహించడమే సరైన మార్గమని భావిస్తోంది.

ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు నిరీక్షించకుండా…. క్షేత్రస్థాయిలో ముందస్తు సన్నాహక చర్యలు వెంటనే ప్రారంభించాలని సహకార శాఖ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా రూపకల్పన, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ప్రాథమిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించింది.

ఎన్నికల సన్నాహాలకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను రాబోయే పది రోజుల్లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారుల నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఆఖరి రూపానికి తీసుకురానున్నారు.

జనవరిలో ఎన్నికలు….?

ప్రభుత్వ యోచన ప్రకారం వచ్చే ఏడాది జనవరి నెలలో ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సహకార ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అత్యంత కీలకమైన పీఏసీఎస్ పాలకవర్గాలు ఏర్పాటు కావడం ద్వారా వ్యవసాయ రుణాలు, ఎరువుల పంపిణీ మరియు ఇతర సహకార సేవలు మరింత పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయని రైతులు భావిస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా కూడా వేడి రాజుకునే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More