‘అర్నబ్’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాన్ని వణికించింది. భయంకరమైన గాలులు, విపరీతమైన సముద్ర అలలతో తుపాను తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని తీవ్ర అలర్ట్‌లో ఉంచింది. ప్రజల ప్రాణాలను కాపాడటం, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఉపశమనం కలిగించే అంశం.
మంగళవారం రాత్రి నుంచే విపత్తు నిర్వహణ బృందాలు సేవల్లో నిమగ్నమయ్యాయి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచే మొబైల్ అత్యవసర హెచ్చరిక మెసేజ్‌లు పంపారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఉన్నతాధికారులు నిమిషనిమిషం పర్యవేక్షిస్తున్నారు.
ఉప్పాడ రోడ్డు ధ్వంసం.. పునరుద్ధరణ పనులు….
తుఫాన్ తీవ్రతకు సముద్రం తీవ్రంగా ఉప్పొంగడంతో పాటు తీవ్ర తీర కోత ఏర్పడింది. దీని ఫలితంగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ కోస్టల్ రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రాంతంలో రవాణా పునరుద్ధరించడానికి…. తీరప్రాంతాన్ని కాపాడటానికి సహాయక బృందాలు ఇప్పటికే మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాయి.
మరోవైపు పంట నష్టాన్ని త్వరితగతిన అంచనా వేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందిస్తూ, దెబ్బతిన్న పంటల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అర్హులైన రైతులకు తక్షణమే ఆర్థిక, లాజిస్టిక్ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం
వాతావరణ శాఖ (IMD) ముందస్తు సమాచారం ప్రకారం… అర్నబ్ తుఫాన్ ‘అత్యంత తీవ్ర తుపాను’గా మారి, గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కిలోమీటర్ల ఈదురుగాలులతో తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏవియేషన్ భద్రతను సమీక్షించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది.
కోస్తా ఆంధ్రా, దక్షిణ ఒడిశా (భువనేశ్వర్‌తో సహా) విమానాశ్రయాల నుంచి జరిగే విమాన సర్వీసులపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను గమనాన్ని బట్టి హైదరాబాద్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్ విమానాశ్రయాల సర్వీసుల్లో కూడా జాప్యం చోటుచేసుకునే అవకాశముంది.
రద్దయిన ప్రధాన విమానాలు
- విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచే సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
- విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటల తర్వాత అన్ని విమానాలను రద్దు చేశారు.
- అక్టోబర్ 28న ఢిల్లీ-భోగాపురం-ఢిల్లీ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు.
- ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ-విశాఖపట్నం, ఢిల్లీ-విజయవాడ మార్గాల్లో 6 విమానాలను రద్దు చేసింది.
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 13 సర్వీసులను రద్దు చేసింది. ఇందులో విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలకు వెళ్లే విమానాలతో పాటు వారణాసి-బ్యాంకాక్, బ్యాంకాక్-విశాఖపట్నం సర్వీసులు ఉన్నాయి.
- అకాశా ఎయిర్ సంస్థ ఢిల్లీ-భోగాపురం సర్వీసును రద్దు చేయగా, అలయన్స్ ఎయిర్ సర్వీసులు ఎలాంటి విఘాతం లేకుండా నడుస్తున్నాయి.
ప్రయాణికులకు ముఖ్య సూచనలు
{{/usCountry}}కోస్తా ఆంధ్రా, దక్షిణ ఒడిశా (భువనేశ్వర్‌తో సహా) విమానాశ్రయాల నుంచి జరిగే విమాన సర్వీసులపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. తుపాను గమనాన్ని బట్టి హైదరాబాద్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్ విమానాశ్రయాల సర్వీసుల్లో కూడా జాప్యం చోటుచేసుకునే అవకాశముంది.
రద్దయిన ప్రధాన విమానాలు
- విశాఖపట్నం విమానాశ్రయంలో అక్టోబర్ 27 మధ్యాహ్నం నుంచే సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.
- విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో అక్టోబర్ 27 సాయంత్రం 7 గంటల తర్వాత అన్ని విమానాలను రద్దు చేశారు.
- అక్టోబర్ 28న ఢిల్లీ-భోగాపురం-ఢిల్లీ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు.
- ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ-విశాఖపట్నం, ఢిల్లీ-విజయవాడ మార్గాల్లో 6 విమానాలను రద్దు చేసింది.
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 13 సర్వీసులను రద్దు చేసింది. ఇందులో విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలకు వెళ్లే విమానాలతో పాటు వారణాసి-బ్యాంకాక్, బ్యాంకాక్-విశాఖపట్నం సర్వీసులు ఉన్నాయి.
- అకాశా ఎయిర్ సంస్థ ఢిల్లీ-భోగాపురం సర్వీసును రద్దు చేయగా, అలయన్స్ ఎయిర్ సర్వీసులు ఎలాంటి విఘాతం లేకుండా నడుస్తున్నాయి.
ప్రయాణికులకు ముఖ్య సూచనలు
{{/usCountry}}విమానాశ్రయాలకు బయలుదేరే ముందే విమాన సంస్థల అధికారిక వెబ్‌సైట్, యాప్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా విమాన స్థితిని (Flight Status) సరిచూసుకోవాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణికులను కోరింది. కన్ఫర్మ్ అయిన టికెట్ ఉంటేనే విమానాశ్రయాలకు బయలుదేరాలని, మార్గమధ్యంలో నీటి నిల్వలు మరియు రోడ్ల మూసివేత ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణ సమయాన్ని కాస్త ఎక్కువగా అంచనా వేసుకుని బయలుదేరాలని సూచించింది.