AP Assembly Monsoon Sessions 2026 : ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సమావేశాల ప్రారంభ తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.... ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు ఉభయ సభలు సిద్ధమవుతున్నాయి.

సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజే లేదా తొలి రోజు ఉదయాన్నే ఉభయ సభల బీఏసీ సమావేశమవుతుంది. సభ నిర్వహణ… అజెండాను ఈ కమిటీ ఖరారు చేయనుంది. ప్రాథమిక వివరాల ప్రకారం.... ఈ వర్షాకాల సమావేశాలను సుమారు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కీలక బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చ....
ఈ నాలుగు రోజుల పరిమిత కాలంలోనే రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభ వేదికగా విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది. వీటితో పాటు ప్రభుత్వం ప్రతిపాదించిన పలు కీలక బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డీఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ నేతలు నిరసనలు చేస్తున్నారు. ప్రతిపక్షం లెవనెత్తుతున్న అంశాలపై... విద్యాశాఖ కూడా క్లారిటీ ఇస్తూ వస్తోంది. అయినప్పటికీ... ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలను సీఎం చంద్రబాబుతో సహా మంత్రులందరూ కూడా కొట్టిపారేస్తున్నారు. ఇక భోగాపురం క్రెడిట్ విషయంలోనూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరువుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు... ఈసారైనా పాల్గొంటారా..? లేదా అనేది చూడాలి. ఒకవేళ వీరు హాజరైతే... చాలా అంశాలపై వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఈ నేపథ్యంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరువుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు... ఈసారైనా పాల్గొంటారా..? లేదా అనేది చూడాలి. ఒకవేళ వీరు హాజరైతే... చాలా అంశాలపై వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}