అమరావతికి చట్టబద్దత కల్పించాలని తీర్మానం - ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం..! కేంద్రానికి కాపీలు

 అమరావతి శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆపై ఈ తీర్మానాన్ని స్పీకర్…. కేంద్రానికి పంపించారు.

Published on: Mar 28, 2026, 18:27:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ చేసిన తీర్మానానికి సభ ఆమోదం పలికింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

అమరావతిని రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ స్పీకర్ … రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్ కు పంపారు. కేంద్ర హోం మంత్రితో పాటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్ కు పంపారు. ఈ తీర్మానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ కీలకమైన సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు.

సీఎం చంద్రబాబు ప్రసంగం…

ఈ తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులు అనే పేరు మనకు వచ్చిందన్నారు. పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించిందని గుర్తు చేశారు. మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్ కు రాజధాని మారిందని… ఇప్పుడు అమరావతికి మార్చుకున్నామని తెలిపారు. రాజధానులు కోల్పోవటం విమర్శలు, వివక్షత, అవమానాలు భరిస్తూనే వచ్చామని వ్యాఖ్యానించారు.

“1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం. 1991లో ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాం. 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోంది. సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశాం. ఫలితాలు వచ్చాయి. అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. విభజన సమయంలో సమన్యాయం చేయాలని కోరాను. ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో ఉండి కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ, త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం.9 నెలల్లో ఈ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నాం” అని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

“తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం. విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పాడు. కానీ రోజుకో మాట ఊసరవెల్లి రాజకీయాలు చేశాడు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేశాడు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చు. రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించాను.ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించి 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చేశారు. రాజధానికి రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను” అని చంద్రబాబు చెప్పారు.

రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వక్తులు తోటలకు నిప్పు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుకు కూడా ఈమెయిళ్లు పెట్టారని చెప్పారు. కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని… అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More