...
...
Next Story

AP BRAGCET 2026 : ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. మార్చి 1వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.

Published on: Feb 25, 2026 07:57 AM IST
Advertisement

ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ అయితే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6 నుంచి 10వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లను కూడా భర్తీ చేస్తారు.

AP BRAGCET 2026 - హాల్ టికెట్లు విడుదల
AP BRAGCET 2026 - హాల్ టికెట్లు విడుదల

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రాసెస్ ముగిసింది. తాజాగా ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

గురుకుల ఎంట్రెన్స్ హాల్ టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్

  1. విద్యార్థులు https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి లాగిన్ కావాలి.
  4. ఇక్కడ మీ హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందాలి.
  6. పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్ ఉంటేనే అనుమతిస్తారు.

AP BRAGCET 2026లో భాగంగా 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పై ప్రశ్నలుంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియతో ఎగ్జామ్ ఉంటుంది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం కూడా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకుగానూ నిర్వహిస్తారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సామాజిక అధ్యయనాలు, ఇంగ్లీశ్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పదో తరగతి స్థాయిలోప్రశ్నలు అడుగుతారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe