స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 10, 2026, 16:29:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజీవ్‌ రంజన్‌ కమిషన్‌ ప్రభుత్వం అందించిన సమగ్ర నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన కేబినెట్ …. దాని ఆధారంగానే స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసింది.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు

కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు మొత్తం 8 వేర్వేరు కేటగిరీల్లో పంచాయతీ వార్డు మెంబర్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌, మున్సిపల్‌ వార్డు మెంబర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మరియు మేయర్‌ పదవులకు సంబంధించి బీసీలకు ఎంతమేర ప్రాతినిధ్యం కల్పించాలో పక్కాగా నిర్ణయించినట్లు తెలిపారు.

గ్రామీణ స్థానిక సంస్థల్లో:

  • గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం తీర్మానించింది.
  • సర్పంచ్‌ పదవుల్లో బీసీలకు 27.95 శాతం మేర రిజర్వేషన్ వర్తిస్తుంది.
  • మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల్లో 25.55 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు.
  • మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) పదవుల్లో 24.60 శాతం రిజర్వేషన్ ఖరారైంది.
  • జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) స్థానాలకు 24.60 శాతం కేటాయించారు.
  • జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో బీసీలకు 23.08 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.

పట్టణ స్థానిక సంస్థల్లో:

  • పట్టణాల్లోని మున్సిపల్ అర్బన్ వార్డు మెంబర్లలో బీసీలకు అత్యధికంగా 32.78 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
  • మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవుల్లో 32.03 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు.
  • కార్పొరేషన్ల మేయర్ స్థానాల్లో బీసీలకు ఏకంగా 35.02 శాతం మేర రిజర్వేషన్లు దక్కేలా ప్రతిపాదనను ఆమోదించారు.

వెనుకబడిన వర్గాలకు స్థానిక పాలనలో ప్రాతినిధ్యం పెంచేందుకు చట్టబద్ధమైన కమిషన్ ఇచ్చిన గణాంకాలు, వర్గీకరణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ కోటాను నిర్ధారించిందని మంత్రులు తెలిపారు.

పార్టీపరంగా 34 శాతం సీట్లు - మంత్రి అచ్చెన్నాయుడు

బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో 50.42 శాతం మేరకు బీసీ జనాభా ఉందన్నారు. బీసీలకు టీడీపీ అన్యాయం చేయదన్న ఆయన.. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More