...
...
Next Story

AP EDCET Counselling : ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు తేదీ, 14 నుంచి వెబ్ ఆప్షన్లు!

AP EDCET Counselling 2026 : ఆంధ్రప్రదేశ్‌లో బీఈడీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ (AP EDCET 2026) ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి తేదీ కాగా…. ఈనెల 14 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Oct 12, 2026, 12:24:17 IST
Advertisement

AP EDCET Counselling 2026 : రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్ (AP EDCET - 2026) కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రక్రియ ఇవాళ్టితో (అక్టోబర్ 12) ముగియనుంది. బీఈడీ చదవాలనుకునే అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా…. సాంకేతిక సమస్యలు ఎదురవక ముందే వెంటనే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.

ఈనెల 14 నుంచి వెబ్ ఆప్షన్లు - ముఖ్య తేదీలు :

  • వెబ్ ఆప్షన్ల నమోదు : ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అభ్యర్థులు తమకు కావాల్సిన కళాశాలలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.
  • ఆప్షన్ల మార్పు (ఎడిట్ ): నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఈ నెల 19న అవకాశం కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు : అభ్యర్థులు సాధించిన ర్యాంకు, రిజర్వేషన్లు, ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ప్రాతిపదికన ఈ నెల 23వ తేదీన సీట్లు కేటాయిస్తారు.
  • రిపోర్టింగ్ - తరగతుల ప్రారంభం : సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 28 మధ్య సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు…. ఈ నెల 24వ తేదీ నుంచే కళాశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభమవుతాయి.

కౌన్సెలింగ్‌కు కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికెట్లు…

ఏపీ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్
ఏపీ ఎడ్‌సెట్ 2026 కౌన్సెలింగ్

అభ్యర్థులు సర్టిఫికెట్ పరిశీలన మరియు అడ్మిషన్ ప్రక్రియ కోసం కింద సూచించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

  • డిగ్రీ / పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరియు మార్కుల జాబితా
  • 10వ తరగతి (SSC) మరియు ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు
  • 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ / బోనాఫైడ్ సర్టిఫికెట్లు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (EWS Certificate - వర్తించే వారికి మాత్రమే)
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్
  • ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఆధార్ కార్డ్

విద్యార్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్, కళాశాలల వివరాలు, ఇతర సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ ( https://edcet.tgche.ac.in/ ) ను సందర్శించాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks