ఆంధ్రప్రదేశ్‌లోని ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో రైతులకు తక్షణ నగదు లభ్యత పెంచేందుకు బ్యారన్‌కు ₹50,000 చొప్పున ఒకేసారి వడ్డీ లేని రుణం అందించడానికి ఆమోదం తెలిపింది.
డీబీటీ ద్వారా రూ.220 కోట్ల సాయం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్’ కింద ఈ సాయాన్ని అందించనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.220 కోట్ల నిధులను కేటాయించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ రుణ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు.
అంతర్జాతీయ మార్కెట్ సవాళ్లకు చెక్
ప్రస్తుతం ప్రపంచ పొగాకు మార్కెట్‌లో డిమాండ్ సరళి మారడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు మారడం వల్ల పొగాకు కొనుగోళ్లు, మార్కెటింగ్ ప్రక్రియలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా, తదుపరి పంట కాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి, పాత రుణాలు చెల్లించుకోవడానికి ఈ వడ్డీ లేని రుణం ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
మార్కెటింగ్ మెరుగుదలకు ప్రత్యేక చర్యలు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎఫ్‌సీవీ పొగాకు విస్తారంగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 పంట కాలానికి సంబంధించి మార్చి 25 నుంచి వేలం పాటలు ప్రారంభమవ్వగా, ఇప్పటివరకు సుమారు 100 మిలియన్ కిలోల పొగాకును వేలం వేసినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. రైతులకు మద్దతుగా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
"రైతుల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు తదుపరి సాగు సీజన్‌కు వారు సిద్ధమయ్యేందుకు ఈ ఆర్థిక చేయూత ఉపకరిస్తుంది" అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాలపరిమితితో కూడిన ఈ సహాయం ద్వారా పొగాకు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం పునరుద్ఘాటించింది.
{{/usCountry}}"రైతుల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు తదుపరి సాగు సీజన్‌కు వారు సిద్ధమయ్యేందుకు ఈ ఆర్థిక చేయూత ఉపకరిస్తుంది" అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాలపరిమితితో కూడిన ఈ సహాయం ద్వారా పొగాకు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం పునరుద్ఘాటించింది.
{{/usCountry}}