AP Budget Meetings : ఏపీ సర్కార్ వినూత్న కార్యక్రమం - త్వరలో జిల్లాల్లో 'బడ్జెట్' సమావేశాలు..!
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని సిద్ధమవుతోంది. ప్రజల వద్దకు బడ్జెట్ ను తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో… త్వరలో జిల్లాలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ప్రజలకు బడ్జెట్ గురించి వివరించాలని నిర్ణయించింది. త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తోంది. త్వరలోనే జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఇదే విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలకు బడ్జెట్ గురించి వివరిస్తామన్నారు.

ఇవాళ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యాల గురించి అధికారులకు వివరించారు.సీఎం సూచనలతో ఈ సారి ఆర్థిక శాఖ ఒక వినూత్న ఒరవడితో ముందుకెళుతోందని చెప్పారు. గతంలో మార్చి 31తేదీ వరకు కూడా బడ్జెట్ పూర్తీ చేసేవారు కారు… కానీ ఇప్పుడు 20 రోజులకంటే ముందే బడ్జెట్‌ను పూర్తి చేశామని తెలిపారు.
గత రెండు సంవత్సరాలు ప్రభుత్వం అనేక ఒడిదొడుకులను తట్టుకుని ముందుకెళ్లిందని మంత్రి పయ్యావుల వివరించారు. ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకెళుతోందన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలో రాష్ట్రం ఈ రోజు ఒక అసాధరణ వృద్ధి పథంవైపు పయనిస్తోందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరం అసాధరణ వృద్ధి సంవత్సరం (ఇయర్ ఆఫ్ ఎక్ట్స్రార్డినరీ గ్రోత్)గా నిలవబోతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులంతా ద్విగిణీకృత ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
త్వరలోనే తేదీలు ఖరారు - మంత్రి పయ్యావులు
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ఈ సారి ఒక సామాన్యుడి ఇంటి బడ్జెట్ తరహాలో రూపొందించామన్నారు. తద్వరా బడ్జెట్‌ను సామాన్యుడి చెంతకు తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. బడ్జెట్ మీటింగులు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఆ ప్రకారం జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ లోపు ఆయా జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ బడ్జెట్‌లో జిల్లాల వారీగా కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. తద్వారా బడ్జెట్ గురించి ఆ జిల్లాల్లో ప్రజలకు వివరించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ప్రతి పైసా కూడా ఖర్చు చేయాలని మంత్రి పయ్యావుల అధికారులను కోరారు. కేంద్రం నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు కోసం వచ్చే నిధుల్లో ప్రతి పైసా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే కొన్ని చోట్ల కాస్తంత నిర్లిప్తత కనిపిస్తోందన్నారు. అలా కాకుండా కేటాయించిన ప్రతి రూపాయిని కూడా వృథా కాకుండా సమర్థంగా ఖర్చు చేయాలన్నారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏఏ శాఖలో ఎక్కడెక్కడ ఖర్చు చేయడం లేదో వాటిని గుర్తించి వాటిని ఖర్చు చేయడానికి అమిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దిశగా ఆయా శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో మొత్తం వ్యయాన్ని ఖర్చు చేయాలనేదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు పది సూత్రాల కార్యక్రమం లక్ష్యాలు సాధించే దిశగా అధికారులు పనిచేయాలని…. జీెెెఎస్డీపీ లక్ష్యాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











