పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సందర్శించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని, బాధితుల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించినట్లు ఆయన తెలిపారు. తుఫాన్ ధాటికి ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు నివారించడానికి ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు.

"తుఫాన్ ముప్పు పొంచి ఉన్న సమయంలో క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతరం టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అప్రమత్తం చేశాం. వర్షాలతో ఎంత వరద నీరు వచ్చే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేసి ఆయా జిల్లాల కలెక్టర్లను సన్నద్ధం చేశాం. గతంలో వచ్చిన తుఫాన్లతో పోలిస్తే ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగాం. అయితే దురదృష్టవశాత్తూ ఈ తుఫాన్ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న కోనసీమ జిల్లాలో పర్యటించిన నేను, ఇవాళ నర్సాపురం పరిధిలోని దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించాను," అని సీఎం తెలిపారు.
పునరుద్ధరణ పనులు వేగవంతం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 15 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను పూర్తిగా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ పునరుద్ధరణలో భాగంగా మొదటగా గృహాలకు, ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేసేందుకు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పిస్తున్నామని చెప్పారు.
ఇక కమ్యూనికేషన్ వ్యవస్థల పునరుద్ధరణపై స్పందిస్తూ, "ప్రైవేటు ఆపరేటర్ల టవర్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్లే సిగ్నల్స్ రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాటికి కూడా వెంటనే విద్యుత్ అందించి సిగ్నల్స్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 12,500 చెట్లు నేలకూలాయి. రోడ్లపై పడిన చెట్ల వ్యర్థాలను అదే రోజు తొలగించి రాకపోకలను పునరుద్ధరించాం. మిగిలిన వ్యర్థాలను కూడా త్వరితగతిన తొలగిస్తున్నాం," అని చంద్రబాబు వివరించారు.
రూ.4,600 కోట్ల ప్రాథమిక నష్టం – కేంద్రానికి నివేదిక
తుఫాన్ కారణంగా కొబ్బరి తోటలు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "ముందస్తుగా పంటల బీమా చేయించుకున్న రైతులు నష్టపోరు. అందుకే ప్రతీ ఒక్క రైతు తమ పంటలకు బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాల వల్ల వచ్చిన వరద నీటిని వేర్వేరు రిజర్వాయర్లు, చెరువులలోకి మళ్లించి నింపేలా చర్యలు తీసుకున్నాం. తుఫాన్ వల్ల ప్రాథమికంగా రూ.4,600 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపాం," అని ఆయన పేర్కొన్నారు.
బాధితులకు రూ. 5 లక్షల నష్టపరిహారం
{{/usCountry}}తుఫాన్ కారణంగా కొబ్బరి తోటలు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. "ముందస్తుగా పంటల బీమా చేయించుకున్న రైతులు నష్టపోరు. అందుకే ప్రతీ ఒక్క రైతు తమ పంటలకు బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వర్షాల వల్ల వచ్చిన వరద నీటిని వేర్వేరు రిజర్వాయర్లు, చెరువులలోకి మళ్లించి నింపేలా చర్యలు తీసుకున్నాం. తుఫాన్ వల్ల ప్రాథమికంగా రూ.4,600 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపాం," అని ఆయన పేర్కొన్నారు.
బాధితులకు రూ. 5 లక్షల నష్టపరిహారం
{{/usCountry}}తుఫాన్ ధాటికి మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. పంటలు నీటమునిగిన రైతులను, వలలు, పడవలు కోల్పోయిన మత్స్యకారులను, కొబ్బరి చెట్లు కూలి నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
బాధితులందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని, తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన చిట్టచివరి వ్యక్తికి కూడా న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పటికీ… రాజకీయం కంటే తుఫాన్ బాధితుల సమస్యలు తీర్చడానికే తాము మొదటి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల
ఇదే సమయంలో రైతులకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి. "పీఎం-కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఏడాదికి మూడు విడతలుగా మొత్తం రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి రెండో ఏడాది రెండో విడతగా రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేశాం. భవిష్యత్తులో వరద ముంపును శాశ్వతంగా నివారించేందుకు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను వేగవంతం చేస్తాం," అని చంద్రబాబు చెప్పారు.
మీడియా సమావేశం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు స్వయంగా తుఫాన్ బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, బంగాళదుంపలు తదితర రేషన్ సామాగ్రిని బాధితులకు అందజేశారు.