AP Annadata Sukhibhava Scheme : అన్నదాత సుఖీభవ స్కీమ్ అప్డేట్ - ఆ రోజే రైతుల ఖాతాలోకి రూ. 6 వేలు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త వచ్చేసింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నిధుల కింద రూ.6 వేలు జమ కానున్నాయి. ఇందుకు ప్రాథమికంగా తేదీని ఖరారు చేశారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ స్కీమ్ కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 30వ తేదీన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.

ఒకేసారి ఖాతాల్లోకి రూ. 6,000
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సాయం రూ. 2,000తో పాటు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 ఒకే విడతలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. నిజానికి ఈ నిధులను అక్టోబర్ 17వ తేదీనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ…. కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది.
ప్రస్తుతం దీపావళి పండగను పురస్కరించుకుని అక్టోబర్ 30న నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. పీఎం కిసాన్ నిధులు విడుదలను బట్టి… రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జమ చేస్తుంది.
ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను ప్రభుత్వం జూన్ 20వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సాయం కేవలం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా, భూమి లేని పేద కౌలు రైతులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే 'క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్' కలిగి ఉండటం తప్పనిసరి.
రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలను (రైతు భరోసా కేంద్రాలు) సంప్రదించి, భూ యజమాని అంగీకారంతో ఈ సీసీఆర్సీ కార్డును పొందవచ్చు. ఈ కార్డు లేని కౌలు రైతులకు ఆర్థిక సాయం అందే అవకాశం ఉండదు. కాబట్టి అర్హులైన కౌలు రైతులు వెంటనే తమ భూ యజమానులతో మాట్లాడి నామినేషన్ ప్రక్రియ తరహాలోనే ఈ కార్డును పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలి?
- ముందుగా అధికారిక 'అన్నదాత సుఖీభవ' పోర్టల్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో కనిపించే "Know Your Status" (మీ స్టేటస్ తెలుసుకోండి) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ సంఖ్య మరియు స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
- వివరాలు సమర్పించగానే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో స్పష్టంగా కనిపిస్తుంది.
మనమిత్ర వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోవచ్చు:
- ముందుగా 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అనే మేసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ఆప్షన్స్ డిస్ ప్లే అవుతాయి. ఇక్కడ అన్నదాత సుఖీభవ సేవను ఎంచుకోవాలి.
- ఇక్కడ్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- దీంతో రైతు వివరాలు కనిపిస్తాయి.
ఈకేవైసీ సమస్య ఉంటే… డబ్బులు జమ కావు. అప్పుడు వ్యవసాయశాఖ అధికారులను కలిసి తగిన పత్రాలను అందజేసి.. ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

