...
...
Next Story

రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు - ఈనెల 9 వరకు రైతులకు పంపిణీ

ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. అధికారిక చిహ్నంతో కూడిన 22 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు. గ్రామసభల ద్వారా వీటిని రైతులకు అందజేస్తున్నారు. భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో మాత్రమే వీటిని పంపిణీ చేస్తున్నారు.

Published on: Jan 3, 2026, 10:03:02 IST
Advertisement

భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పట్టాదారు పాస్ బుక్ ల పంపిణీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త పాస్ పుస్తకాల పంపిణీని ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. అధికారిక చిహ్నంతో మాత్రమే వీటిని అందిస్తున్నామని చెప్పారు.

కొత్త పట్టాదారు పాస్ పుస్తకం
కొత్త పట్టాదారు పాస్ పుస్తకం

రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని విమర్శించారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో... రీ సర్వే తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి పార్టీలు హామీనిచ్చాయని గుర్తు చేశారు.

“ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టాం. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభమైంది. జనవరి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

“గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. వివాదాలు లేని స్థలాలను కూడా రీ సర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యం" అని సీఎం చంద్రబాబు వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks