...
...
Next Story

పండుగ వేళ మందు బాబులకు షాక్.. మద్యం ధరను బాటిల్‌కు రూ.10 పెంచిన ప్రభుత్వం

సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Jan 13, 2026, 09:27:46 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు పండుగ సమయంలో షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ రూ.99 ఉన్న మద్యం సిసాలు మినహా అన్ని రకాల బ్రాండ్లపై పరిమాణంతో సంబంధం లేకుండా రూ.10 చొప్పున పెంచింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జీఓ ఎంఎస్ 22ను జారీ చేశారు. దీని ప్రకారం, మద్యంపై రూ.99 (180 ml) ఎంఆర్‌పీ కలిగిన క్వార్టర్ మినహాయించి.. అన్ని బాటిళ్ల మీద రూ.10 చొప్పున ఎక్కువగా వసూలు చేస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అంతేకాకుండా బార్‌ లైసెన్స్‌దారులపై విధిస్తున్న 15 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం తొలగించింది. ఇక మీద మద్యం దుకాణదారులు, బార్ లైసెన్స్‌దారులు ఏపీఎస్‌బీసీఎల్ నుంచి ఒకే ధరకు మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-26 సంవత్సరానికి దుకాణాలకు సంబంధించి కొత్త ఎక్సైజ్ విధానాన్ని జారీ చేసింది. దీనిలో దుకాణాల సంఖ్య, పారవేసే విధానం, రిటైల్ ఎక్సైజ్ పన్ను, రిటైలర్ మార్జిన్, ఇతర అంశాలను నిర్ణయించారు.

గత డిసెంబర్ 22న మంత్రుల బృందం సమావేశమై బార్‌లు కొనుగోలు చేసిన మద్యం ఉత్పత్తులపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని(ARET) అదనపు లెవీ వల్ల కలిగే ప్రభావాలను చర్చించింది. నవంబర్ 2019కి ముందు ఏపీ రాష్ట్ర పానీయాల కార్పొరేషన్ హోల్‌సేల్ డిపోలు సరఫరా చేసే ఐఎంఎఫ్ఎల, ఎఫ్ఎల్ ఇన్‌వాయిస్ ధర బార్‌లు, రిటైల్ దుకాణాలు రెండింటికీ ఒకే విధంగా ఉండేదని, సరఫరా, పన్ను నిర్మాణంలో సమానత్వాన్ని నిర్ధారిస్తుందని గమనించారు. నవంబర్ 2019 నుండి బార్‌లకు ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ స్టాక్ సరఫరాలపై ప్రత్యేకంగా రిటైల్ ఎక్సైజ్ పన్నును అదనంగా విధించారు. దీని ఫలితంగా అదే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ స్టాక్‌ల రిటైల్ దుకాణాలతో పోలిస్తే బార్‌లకు ఇన్‌వాయిస్ ధర ఎక్కువగా ఉంది. కాబట్టి బార్‌లు అదనపు ARET చెల్లిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe