నాటక సమాజాలు, కళాకారులు, రచయితలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక నంది నాటకోత్సవాలు-2025తో పాటు కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

నంది నాటకోత్సవాలు-2025 కోసం పోటీ పడేందుకు నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు (చైల్డ్ ఆర్టిస్ట్స్/చిల్డ్రన్ ప్లేస్), కాలేజీ/యూనివర్సిటీ నాటకాలు, నాటకరంగం, ప్రదర్శన కళలపై రాసిన గ్రంథాలు/పుస్తకాల కోసం సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కందుకూరి పురస్కారాలు - 2026 నాటకరంగానికి విశేష సేవలు అందించిన పౌరాణిక, సాంఘిక నాటక కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థల నుండి ఈ పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కందుకూరి రంగస్థల ప్రతిభా పురస్కారం అందించనున్నారు. జిల్లా స్థాయిలో కందుకూరి విశిష్ట పురస్కారాలు అందజేస్తారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.apsftvtdc.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026గా నిర్ణయించారు. హార్డ్ కాపీల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 26 సాయంత్రం లోపు ఉంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తయిన తర్వాత, ఆ ఫారమ్‌ను ప్రింట్‌అవుట్ తీసి, దానికి అవసరమైన ధృవీకరణ పత్రాలు జతచేసి, సంతకం చేసిన అనంతరం క్రింది పేర్కొన్న చిరునామాకు అక్టోబర్ 26 నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
మేనేజింగ్ డైరెక్టర్,
{{/usCountry}}మేనేజింగ్ డైరెక్టర్,
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC),
4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్,
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS),
విజయవాడ – 520013.
దరఖాస్తుదారులు నమోదు చేసేటప్పుడు తమ నాటకం లేదా గ్రంథానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, ప్లే-లిస్ట్, కళాకారుల వివరాలు, గత ప్రదర్శనల వివరాలు/వీడియో లింకులు స్పష్టంగా సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వారు స్థానికత, వారి సేవల సమయాన్ని ధృవీకరించే పత్రాలను తప్పనిసరిగా జతచేయాలి.
పోస్ట్ ద్వారా పంపే హార్డ్ కాపీలు నిర్దేశిత గడువు అక్టోబర్ 26 దాటితే పరిశీలించరు. పూర్తి వివరాలకు www.apsftvtdc.in పోర్టల్‌ను చూడవచ్చు.