ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
ఎన్టీఆర్ వైద్య సేవలోకి ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులు.. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. త్వరలోనే ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద 238 ప్యాకేజీలతో నగదు రహిత చికిత్స అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఇప్పటివరకు అలోపతి వైద్య విధానానికే పరిమితమైన నగదు రహిత వైద్య సేవలను, త్వరలోనే ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రులకు కూడా విస్తరించబోతోంది. సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, హోమియోపతి, యోగా-నేచురోపతి, యునానీ చికిత్సలను ‘డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్య సేవా ట్రస్ట్’ (Dr NTR Vaidya Seva Trust) పరిధిలోకి తీసుకురావడానికి వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు పూర్తి చేసింది.

ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖకు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేసింది.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్య శాఖ అధికారులు మొత్తం 238 రకాల వ్యాధులు, చికిత్సా ప్యాకేజీలను రూపొందించారు. ఆయుర్వేదం 89 ప్యాకేజీలు, హోమియోపతి 55 ప్యాకేజీలు, యోగా మరియు నేచురోపతి 51 ప్యాకేజీలు, యునానీ 43 ప్యాకేజీలు ఉన్నాయి.
ఈ చికిత్సలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్ ధరలను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, సీజీహెచ్‌ఎస్, ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ స్లాబ్‌లకు అనుగుణంగా ఖరారు చేశారు. ఈ పథకం కింద నకిలీ, నామమాత్రపు ఆసుపత్రులు చేరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినమైన అర్హత ప్రమాణాలను విధించింది.
సవరించిన ఏపీ అలోపతిక్ అండ్ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ చట్టం, 2002(సవరణ చట్టం నం. 18, 2026) కింద రిజిస్టర్ అయి, కనీసం 20 పడకలు ఉన్న ఆసుపత్రులు మాత్రమే ఎంప్యానెల్‌మెంట్‌కు అర్హులు. ట్రస్ట్ లబ్ధిదారుల కోసం ఆసుపత్రులు తమ మొత్తం పడకలలో పావు వంతు (25 శాతం) పడకలను తప్పనిసరిగా రిజర్వ్ చేయాలి.
స్త్రీ, పురుషులకు వేర్వేరు వార్డులు, 3 పడకల పోస్ట్-థెరపీ రికవరీ యూనిట్, 24 గంటల లైసెన్స్‌డ్ ఫార్మసీ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న అంబులెన్సులు, నిరంతరం అందుబాటులో ఉండే మెడికల్ కోఆర్డినేటర్లు ఉండాలి.
అక్రమ బిల్లింగ్‌ను అరికట్టేందుకు మెడ్కోలు రోగికి చికిత్స ప్రారంభించే ముందు, చికిత్స పూర్తయిన వెంటనే డిశ్చార్జ్ అయ్యే సమయంలో బెడ్ వద్ద తీసిన మూడు ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అంతేకాకుండా, స్థానికంగా ఏడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి.
అర్హులైన రోగులను ఏ కారణంతోనూ వెనక్కి పంపడానికి గానీ, నగదు డిమాండ్ చేయడానికి గానీ ఆసుపత్రులకు వీలులేదు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యే రోగులకు 10 రోజులకు సరిపడా మందులు, తిరుగు ప్రయాణ ఛార్జీలు చెల్లించడంతో పాటు ఏడాది పాటు ఉచిత ఫాలో-అప్ సేవలు అందించాలి. ఒకవేళ ఏదైనా ఆసుపత్రి అధిక ఛార్జీలు వసూలు చేసినా లేదా నాణ్యతలో రాజీ పడినా, వివాదాస్పద క్లెయిమ్ మొత్తానికి 10 రెట్లు జరిమానా విధించడంతో పాటు, కనీసం రెండేళ్ల పాటు ఆసుపత్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు నకిలీ వైద్యులను అరికట్టేందుకు రూపొందించిన ఏపీ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రూల్స్, 2026 ముసాయిదాపై వైద్య సంఘాల నుండి వచ్చిన 18 ప్రధాన అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఆయుష్ వైద్యులకు ఆర్థిక భారం తగ్గించేలా వార్షిక రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించింది.

E-Paper
