...
...
Next Story

ఏపీలో ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు... అలాంటి ప్రచారం నమ్మకండి - వైద్యారోగ్యశాఖ ప్రకటన

ఏపీలో ఎక్కడా మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడికి బర్డ్ ఫ్లై సోకిందనే ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించింది.

Published on: Feb 21, 2026, 10:06:23 IST
Advertisement

చిత్తూరు, అన్నమయ్య, ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి ఏవియన్ ఇన్ఫ్లూంజా (బర్డ్ ఫ్లూ ) సోకినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టంచేశారు.

బర్డ్ ఫ్లూ వార్తలు - ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటన (image source istockphoto.com)
బర్డ్ ఫ్లూ వార్తలు - ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటన (image source istockphoto.com)

సదరు వ్యక్తి నుంచి సేకరించిన నమూనాను వైరాలజీ ల్యాబ్లో పరీక్షించగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఆరోగ్య వివరాలు సేకరణ….

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు వచ్చిన బర్డ్ ఫ్లూ మనుషుల వరకు రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి 'ఓసెల్టామివర్' మాత్రలను అందచేసినట్లు తెలిపారు అంతేకాకుండా ఎన్. 95 మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. లోతైన సర్వైలెన్స్లో భాగంగా క్షేత్రస్థాయిలోని పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు సదరు ప్రభావిత గ్రామాల్లోని కుటుంబ సభ్యుల నుంచి వైద్య సిబ్బంది ఆరోగ్య వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో అనుమానిత లక్షణాలు కలిగిన వారి నుంచి సేకరించిన నమూనాలను తిరుపతిలోని స్విమ్స్ ల్యాబ్లో పరీక్ష చేయించగా ఇప్పటివరకు వచ్చిన 54 రిపోర్టులూ నెగిటివ్ ఉన్నాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా చిత్తూరు, మదనపల్లె పట్టణాల్లోని ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పడకలు సిద్ధం చేశామని తెలిపారు.

అంతేకాకుండా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటిస్తుందని పర్యటిస్తోందని వీరపాండియన్ వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks