దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి : టీటీడీ ఛైర్మన్
దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా స్విమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్విమ్స్‌లో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడారు. రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామన్నారు. ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలో అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు.
ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు బీఆర్ నాయుడు వివరించారు. ఈ సందర్భంగా ఈ రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ఛైర్మన్‌కు వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు ఆర్వీ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు చెప్పారు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆర్వీ కుమార్ పేర్కొన్నారు.
'ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాలు ప్రారంభించాం. రెండో దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించాం. అతి త్వరలోనే టీటీడీ సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసీయూలతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తాం.' అని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












