Sign in

సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు!

సంక్రాంతి పండగకు సొంతూరుకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది.

Published on: Dec 14, 2025, 21:02:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఇంటికి వెళ్లాలి అనుకునేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే మంచి వార్త తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది రిజర్వేషన్లు చేసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను సైతం ప్రకటించింది. ఇప్పటికే మరికొన్ని ట్రైన్స్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

07215 నర్సాపుర్ టూ వికారాబాద్ రైలు జనవరి 19వ తేదీన నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 07266 రైలు.. జనవరి 20వ తేదీన వికారాబాద్ నుంచి రాత్రి 9.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపుర్ వస్తుంది.

ఈ ట్రైన్లు పాలకొల్లు, భీమవరం, ఆకువీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది.

07241 రైలు కాకినాడ టౌన్ టూ వికారాబాద్ మధ్య జనవరి 17వ తేదీన నడుస్తుంది. సాయంత్రం 6.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07242 జనవరి 18వ తేదీన వికారాబాద్ నుంచి సాయంత్రం 6.55కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.30కి కాకినాడ టౌన్‌కి వస్తుంది.

ఈ రైళ్లకు సామల్‌కోట్, ద్వారపూడి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్లలో స్టాప్ ఇచ్చారు.

07243 రైలు కాకినాడ టౌన్ నుంచి వికారాబాద్ మధ్య జనవరి 18వ తేదీన నడుస్తుంది. సాయంత్రం 6.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07259 జనవరి 19వ తేదీన వికారాబాద్ నుంచి సాయంత్రం 6.55కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.20కి కాకినాడ టౌన్‌కి వస్తుంది. 07285 కాకినాడ్ టూ వికారాబాద్ రైలు జనవరి 19వ తేదీన సాయంత్రం 6.20కి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9.45కి వికారాబాద్ చేరుకుంటుంది. ట్రైన్ నెంబర్ 07286 రైలు జనవరి 20వ తేదీన 6.55కి వికారాబాద్ నుంచి బయలుదేరి.. కాకినాడకు మరుసటి రోజు ఉదయం 9.20కి వస్తుంది.

ఈ రైళ్లు కూడా సామల్‌కోట్, ద్వారపూడి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి.

వీక్లీ స్పెషల్ రైళ్లు పొడిగింపు

మరోవైపు వీక్లీ ప్రత్యేక రైళ్లు సైతం దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. ఇప్పటికే ఇవి నడస్తుండగా.. వాటిని సంక్రాంతి రద్దీ దృష్ట్యా పొడిగించారు. జనవరి 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్ - అనకాపల్లి (రైలు నెం.07041), జనవరి 5, 12, 19 తేదీల్లో అనకాపల్లి సికింద్రాబాద్ (రైలు నెం.07042), జనవరి 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్ గోరఖ్‌పూర్ (రైలు నెం.07075), జనవరి 11, 18, 25 తేదీల్లో గోరఖ్‌పూర్ - హైదరాబాద్ (రైలు నెం.07076) రైళ్లను పొడగించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More