రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ (AP ICET) కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. రెండో విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్ల కేటాయింపును ఉన్నత విద్యామండలి పూర్తి చేసింది. ఈ చివరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్లలో 16.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ రెండు కోర్సుల్లో కలిపి మొత్తం 46,620 సీట్లు అందుబాటులో ఉండగా…. అందులో 7,696 సీట్లు భర్తీ అయినట్లు కౌన్సెలింగ్ వర్గాలు వెల్లడించాయి. కోర్సుల వారీగా వివరాలను పరిశీలిస్తే.. ఎంబీఏ విభాగంలో అందుబాటులో ఉన్న 29,816 సీట్లకు గాను 5,054 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. ఇక ఎంసీఏ విభాగంలో ఉన్న 16,804 సీట్లలో 2,642 సీట్లు భర్తీ అయ్యాయి. https://cap.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీలను పొందొచ్చు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుంచి క్రీడా కోటాకు సంబంధించిన తుది జాబితా ఇంకా అందలేదు. ఈ కారణంగా 201 మంది అభ్యర్థులకు సంబంధించిన క్రీడా కోటా సీట్ల భర్తీ ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచారు. శాప్ నుంచి అధికారిక జాబితా అందిన వెంటనే ఈ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.
రిపోర్టింగ్ తేదీలు…
ఏపీ ఐసెట్ - 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వెంటనే తదుపరి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో 'సెల్ఫ్ జాయినింగ్' ప్రక్రియను పూర్తి చేయాలి. అనంతరం తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లి రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ చివరి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కళాశాలలకు హాజరుకావాలని ఉన్నత విద్యామండలి కోరింది. అభ్యర్థులు నిర్దేశిత గడువు ముగిసేలోగా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ సూచించారు. నిబంధనల ప్రకారం గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు.
{{/usCountry}}రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ చివరి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కళాశాలలకు హాజరుకావాలని ఉన్నత విద్యామండలి కోరింది. అభ్యర్థులు నిర్దేశిత గడువు ముగిసేలోగా ప్రాసెస్ ఫీజు చెల్లించి, ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ సూచించారు. నిబంధనల ప్రకారం గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు.
{{/usCountry}}