AP Inter Results 2026 : ఏపీ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఈ తేదీల్లో రిజల్ట్ వచ్చే అవకాశం!

AP Inter Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్‌లోనే ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించిన రెండు తేదీల గురించి వైరల్ అవుతోంది.

Updated on: Apr 12, 2026, 12:41:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Andhra Pradesh Intermediate Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు 2026పై కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ ఫలితాలు 2026 కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏప్రిల్ 18 లేదా 19న విడుదలయ్యే అవకాశం ఉంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. ఫలితాల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్‌కు సంబంధించిన ప్రాసెస్ పూర్తి కానుంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు
ఏపీ ఇంటర్ ఫలితాలు

అధికారిక ప్రకటన త్వరలో రానుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే చూసేందుకు: హాల్ టికెట్ నెంబర్ రెడీగా ఉంచుకోండి. ఒక్కసారిగా విద్యార్థులు అందరూ ఫలితాలు చూసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌కు రావొచ్చు, దీంతో సర్వర్ స్లో ఉండొచ్చు. ఫలితాల ప్రకటన కోసం ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ప్రకటించనున్నారు.

ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టులతో పాటు అదనంగా ఆరో సబ్జెక్టును ఎంచుకున్నారు. ఎంపీసీ విద్యార్థులు బయోలజీని, బైపీసీ విద్యార్థులు మ్యాథ్స్‌తో పాటు ఇతర సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. కోర్సులోని రెగ్యూలర్ సబ్జెక్ట్ ఫలితాలనే బోర్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. వీటి ఫలితాలను సాధారణంగానే ప్రకటించనుంది.

అయితే ఆప్షన్‌గా ఎంచుకున్న సబ్జెక్ట్ రాత పరీక్ష ఫలితాలను మాత్రం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచడం లేదా కాలేజీలకు పంపిస్తారని సమాచారం. దీనిపై ఫలితాల ప్రకటన తర్వాత క్లారిటీ వస్తుంది.

ఏపీ ఇంటర్ ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

మనమిత్ర వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోండి.

  • మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి.
  • రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి.
  • తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి.
  • ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది.
  • ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి.
  • మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి.
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More