AP Model School : ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు - ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
AP Model School Hall Ticekts 2026: ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. apms.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయితే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ(ఏప్రిల్ 2) విడుదలయ్యాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏప్రిల్ 12న ఎంట్రెన్స్ ఎగ్జామ్…
ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.
ఏపీ మోడల్ స్కూల్ ఎగ్జామ్ - హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా
- ముందుగా https://apms.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ అభ్యర్థి లాగిన్ వివరాలను ఎంట్రీ చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవతుుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
- అడ్మిషన్ సమయంలో హాల్ టికెట్ కీలకం. కాబట్టి ఈ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగానే సీటు ఖరారవుతుంది. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సోషల్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది. ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించి…. తుది ఫలితాలను విడుదల చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

