APREIS 2026 : ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు తేదీలివే
APRS CAT – 2026 : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మార్చి 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేస్తారు.

5వ తరగతిలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 4వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఒక మొబైల్ నెంబర్ ను ఒక్క దరఖాస్తుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటీపీ నిర్ధారించబడుతుంది. అప్లికేషన్ లో విద్యార్థి పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. విద్యార్థి ఫొటో, సంతకాన్ని కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నమోదులో తప్పులుంటే ఇబ్బందులు వస్తాయని… ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ ఎంట్రెన్స్ టెస్ట్ ను ఏప్రిల్ 24వ తేదీ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ,పరిసరాల విజ్ఞానం వంటి విభాాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. త్వరలోనే హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…
- ముందుగా https://aprs.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని 5వ తరగతి అడ్మిషన్ లింక్ పైక్లిక్ చేయాలి.
- ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఇక్కడ విద్యార్థి పేరు ,ఆధార్ పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిస్థాయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందాలి.
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

