AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం, పూర్తి సమాచారం
AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జూలై 4 లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి షెడ్యూల్, ఫీజు వివరాలు, అవసరమైన పత్రాల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవచ్చు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ 2026 జూలై 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణీత గడువులోనే విద్యార్థులు తమకు సంబంధించిన అన్ని రకాల ఆన్‌లైన్ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు
- ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్): 24.06.2026 నుండి 30.06.2026 వరకు అధికారులు గడువు ఇచ్చారు.
- హెల్ప్ లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలన: ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ పూర్తికాని వారు లేదా తమ డేటా మార్చాల్సిన అభ్యర్థులు 25.06.2026 నుండి 01.07.2026 వరకు హెల్ప్ లైన్ సెంటర్లను (HLC) సంప్రదించవచ్చు.
- వెబ్ ఆప్షన్ల నమోదు: విద్యార్థులు తమకు కావలసిన కాలేజీలు, కోర్సులను 29.06.2026 నుండి 03.07.2026 వరకు ఆన్‌లైన్‌లో ఎంచుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల సవరణ: నమోదు చేసుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు ఉంటే 04.07.2026 న మాత్రమే మార్చుకునే అవకాశం కల్పించారు.
- సీట్ల కేటాయింపు (అలాట్‌మెంట్): 06.07.2026 న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారులు విడుదల చేస్తారు.
- కాలేజీల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు 07.07.2026 నుండి 10.07.2026 లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు సంబంధిత కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- తరగతుల ప్రారంభం: మొదటి విడత అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు 07.07.2026 నుండి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుంది.
వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులు రూ. 700 చెల్లించాలి. ఇక ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులు రూ. 250 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ ఫీజును యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే చెల్లించాలి.
కౌన్సెలింగ్‌కు అవసరమైన ముఖ్యమైన పత్రాలు:
కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే విద్యార్థులు ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి:
- ఏపీ పాలిసెట్-2026 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్
- అభ్యర్థి ఆధార్ కార్డ్
- ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) లేదా తత్సమాన మార్కుల మెమో
- 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధృవీకరణ పత్రం (BC/SC/ST అభ్యర్థులకు)
- ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ (ఓసీ అభ్యర్థులకు, 2026-27 విద్యా సంవత్సరానికి చెల్లుబాటయ్యేది)
- తల్లిదండ్రుల ఆదాయ ధృవీకరణ పత్రం (01.01.2023 తర్వాత జారీ చేసినది మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అంగీకరిస్తారు)
- బదిలీ సర్టిఫికెట్ (T.C), మైనారిటీ సర్టిఫికెట్ (వర్తించే వారికి)
విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా, లేదా మొబైల్ నంబర్ మార్చాలనుకున్నా సమీప హెల్ప్ లైన్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. దీనితో పాటు కన్వీనర్ కార్యాలయానికి సంబంధించిన chepolycet@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఏదైనా అత్యవసర సమాచారం లేదా సందేహాల కోసం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల లోపు 7842075469, 7842085469, 7842095469 హెల్ప్ లైన్ నంబర్లలో అధికారులను కాంటాక్ట్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

