AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ అప్డేట్ - కీ, ఫలితాలు ఎప్పుడంటే..?

AP POLYCET 2026 Updates : రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2026 పరీక్ష శనివారం ముగిసింది. 92 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.  ప్రాథమిక 'కీ' ఏప్రిల్ 27న అందుబాటులోకి రానుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ఫలితాలను మే 5న విడుదల చేసే అవకాశం ఉంది. 

Published on: Apr 26, 2026, 14:49:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP POLYCET 2026 Updates : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ (POLYCET-2026) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం మొత్తం 1,77,581 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,63,008 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అంటే దాదాపు 92 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు.

ఏపీ పాలిసెట్ 2026
ఏపీ పాలిసెట్ 2026

గత కొన్నేళ్లుగా డిప్లొమా కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఈసారి కూడా పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే హాజరు శాతం ఎక్కువగానే ఉంది. పరీక్ష ముగియటంతో కీలు, ఫలితాల విడుదలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు.

ఏపీ పాలిసెట్ ప్రాథమిక కీని అధికారులు సిద్ధం చేస్తున్నారు. "పాలిసెట్ ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రాథమిక 'కీ'ని ఈ నెల 27న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తాం," అని ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. అభ్యర్థులు ఈ కీని పరిశీలించి.... ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా తెలియజేయాల్సి ఉంటుంది.

మే 5న ఫలితాలు...

ఇక ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మే 5వ తేదీన పాలిసెట్ తుది ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. జూన్ నెలలో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించి.... జూలై నాటికి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

టెన్త్ క్లాస్ తర్వాత త్వరగా ఉపాధి పొందాలనుకునే వారికి పాలిటెక్నిక్ డిప్లొమా ఒక చక్కని మార్గం. మూడు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసిన తర్వాత నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో (ECET ) చేరే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాలిసెట్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఈ ర్యాంకు అత్యంత కీలకం.

ఏపీ పాలిసెట్ కీ - ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి

  • ముందుగా https://polycetap.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని పాలిసెట్ ప్రాథమిక కీ లింక్ పైక్లిక్ చేయాలి.
  • అన్ని సెట్లతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More