...
...
Next Story

ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమి సీట్ల పంపకాలు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూడా సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహకరించుకోవాలని పార్టీల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

Published on: Oct 16, 2026, 06:00:49 IST
Advertisement

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో అధికార కూటమి(టీడీపీ-జనసేన-బీజేపీ) సీట్ల సర్దుబాటు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కొన్నిరోజులుగా సాగిన సుదీర్ఘ చర్చల అనంతరం మూడు పార్టీలు ఒక కొలిక్కి వచ్చాయి. క్షేత్రస్థాయి నాయకులు, శ్రేణుల ఆకాంక్షలతో పాటు రాజకీయ సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుని పొత్తును ఖరారు చేశారు.

కూటమి సీట్ల పంపకాలు
కూటమి సీట్ల పంపకాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో కూటమిలోని పార్టీలు సీట్లను పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 89 స్థానాలు, జనసేన పార్టీ 25 స్థానాలు (మొత్తం వాటాలో 20.33 శాతం), భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు (మొత్తం వాటాలో 7.32 శాతం) చొప్పును సీట్ల పంపకాలు జరిగాయి.

ఇక ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి అని చూసుకుంటే.. 17 మేయర్ పీఠాలను స్థానికంగా ఓటుబ్యాంక్, ఇతర లెక్కల ఆధారంగా పంపకాలు చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ 11 కార్పొరేషన్‌లో పోటీ చేయనుంది. విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరులో పోటీ చేస్తుంది.

జనసేన పార్టీ 4 స్థానాల్లో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడలో మేయర్ పీఠాలు దక్కించుకోనుంది. ఇక భారతీయ జనతా పార్టీ 2 రాజమహేంద్రవరం, అనంతపురంలో బరిలో దిగనుంది.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చూసుకుంటే.. తెలుగుదేశం పార్టీ 78 స్థానాలు, జనసేన పార్టీ 21 స్థానాలు, బీజేపీ 7 చోట్ల పోటీ చేయనున్నాయి. మేయర్ లేదా ఛైర్మన్ పదవిని ఒక పార్టీ దక్కించుకుంటే, వైస్ ఛైర్మన్ / డిప్యూటీ మేయర్ పోస్టును కూటమిలోని మరొక పార్టీకి కేటాయించేందుకు పరస్పర అంగీకారం కుదిరింది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్థానిక నాయకత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సామరస్య పూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలను పరిష్కరించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రధాన అభ్యర్థుల ప్రకటన శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది.

కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జిల్లాల్లోనే పూర్తిచేస్తారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు సమావేశమై శుక్ర, శనివారాల్లో వార్డుల కేటాయింపును ఆమోదిస్తారు. కూటమిలోని పార్టీకి సంపూర్ణంగా సహకారం అందించాలని పైనుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks