APCO - TTD : నేతన్నలకు మరింత భరోసా...! ఆప్కోతో టీటీడీ ఒప్పందం, చరిత్రలో ఇదే తొలిసారి

ఆప్కోతో టీటీడీ ఒప్పందం చేసుకుంది.కండువాలు, దుశ్శాలువాలు, ఇతర వస్త్రాల పంపిణీ చేసేందుకు ఆర్డర్ పెట్టింది.ఆప్కో చరిత్రలో టీటీడీ నుంచి ఆర్డర్ రావటం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు.

Published on: Feb 22, 2026, 05:11:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చేనేత రంగ అభివృద్ధికి, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పన లక్ష్యంగా పలు సంస్థలతో ఆప్కో ఒప్పందం చేసుకుంటోంది. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుంది.

ఆప్కోతో టీటీడీ ఒప్పందం
ఆప్కోతో టీటీడీ ఒప్పందం

ఆప్కోతో టీటీడీ ఒప్పందం….

కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకునే భక్తులకు వేదాశీర్వచనంలో అందజేసే కండువాలు, దుపట్టాలు, కాటన్ బ్లౌజ్ లు టీటీడీకి సరఫరా చేయడానికి ఆప్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టీటీడీ మార్కెటింగ్ శాఖ నుంచి ఆర్డర్ కాపీ ఆప్కో కు వచ్చింది. టీటీడీ నుంచి ఆప్కో కు ఇటువంటి ఆర్డర్ ఇదే మొదటిసారి కావడం విశేషం.

తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఉంటున్నారు. తిరుమలకు విచ్చేసే వీఐపీలకు వెంకన్న ప్రత్యేక దర్శనంతో వేద పండితులు వేదాశ్వీరచనం కూడా అందజేస్తుంటారు. వేదాశీర్వచనం చేసే సమయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, స్వామి చిత్ర పటంతో పాటు కండువాలు, దుశ్శాలువాలు, కాటన్ బ్లౌజ్ లు అందజేయడం సంప్రదాయంగా వస్తోంది.

దీనిలో భాగంగా కండువాలు, దుశ్శాలువాలు, కాటన్ బ్లౌజ్ లు సరఫరా చేయాలని ఆప్కోకు టీటీడీ మార్కెటింగ్ అధికారులు ఆర్డర్ ఇచ్చారు. మొదటి విడతగా మూడు వేల కండువాలు, అయిదు వేల దుశ్శాలువాలు, 90 వేల కాటన్ అప్పర్ లు, 75 వేల కాటన్ బ్లౌజ్ లు తిరుమల దేవస్థానానికి సరఫరా చేయాలోని ఆ ఆర్డర్ లో టీటీడీ అధికారులు పెర్కొన్నారు. టీటీడీకి అందజేసే కండువాలు, దుపట్టాలు, కాటన్ బ్లౌజ్ లపై ఓం నమో వేంకటేశాయ అని తెలుగులో, సంస్కృతంలో ముద్రించాలని టీటీడీ స్పష్టం చేసింది.

మొదటిసారి టీటీడీ ఆర్డర్…

భక్తులకు అందజేసే కండువాలు, శాలువాలు, కాటన్ బ్లౌజ్ లు సరఫరా బాధ్యత గతంలో తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ కు ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత నేతన్నలకు ఏడాది పాటు ఉపాధి కల్పనే లక్ష్యంలో భాగంగా టీటీడీ నుంచి ఆప్కో కు ఆర్డర్ వచ్చేలా చేసిన కృషి ఫలించింది. ఈ అవార్డు రావడంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, అధికారులు కీలక పాత్ర పోషించారు. ఆప్కో ఏర్పడి 51 ఏళ్లలో మొదటిసారి టీటీడీ నుంచి ఆర్డర్ రావడం విశేషం.

చేనేతకు వెంకన్న దీవెన : మంత్రి సవిత

నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి, ఆర్థిక భరోసా కూడిన జీవనం అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేతన్నలకు ప్రయోజనాలు కలిగేలా పథకాలు రూపొందిస్తున్నామని, పలు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నామని వెల్లడించారు. ఆప్కో చరిత్రలో మొదటిసారి టీటీడీతో ఒప్పందం చేసుకోవడం ఆనందకర విషయమన్నారు.

టీటీడీ ఆర్డర్ నేతన్నలకు వెంకన్న దీవెన వంటిదన్నవారు. టీటీడీ, ఆప్కో ఒప్పందం కుదురడంలో ముఖ్యభూమిక పోషించిన చేనేత, జౌళి శాఖాధికారులను మంత్రి సవిత అభినందించారు. ఏపీ నేతన్నలకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలకమండలికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More