...
...
Next Story

Andhrapradesh : గణేష్ మండపాలకు విద్యుత్ కనెక్షన్లు - చెల్లించాల్సిన ఛార్జీలు, రూల్స్ ఇవే

APCPDCL Ganesh Pandal Electricity Permission : వినాయక చవితి మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల చార్జీలను ఏపీసీపీడీసీఎల్ ప్రకటించింది. 500 వాట్లకు రూ.1,000, 1000 వాట్లకు రూ.2,250గా నిర్ణయించారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

Published on: Sep 9, 2026, 07:08:09 IST
Advertisement

APCPDCL Ganesh Pandal Electricity Permission : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఏపీసీపీడీసీఎల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పండుగ సీజన్‌లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను సురక్షితంగా జరుపుకోవాలని ఆయన నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

ఏపీసీపీడీసీఎల్
ఏపీసీపీడీసీఎల్

మండపాల్లో లైటింగ్, ఇతర విద్యుత్ అలంకరణల కోసం అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.

తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఛార్జీలు:

ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇస్తారు. దీనికి సంబంధించి నిర్దేశించిన రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి…

  • 500 వాట్ల లోడ్ వరకు: రూ.1,000
  • 1000 వాట్ల లోడ్ వరకు: రూ.2,250
  • దరఖాస్తు రుసుము: రూ.100

కనెక్షన్ కావాల్సిన నిర్వాహకులు స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాలు, మీ-సేవా కేంద్రాలు లేదా అధికారిక వెబ్‌సైట్ (apcpdcl.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఎండీ వెల్లడించారు. అనుమతి లేకుండా నేరుగా వైర్లకు కొక్కేలు వేసి అక్రమంగా విద్యుత్ వాడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రూల్స్ ఇవే….

  • విద్యుత్ స్తంభాలు, ఓవర్ హెడ్ హైటెన్షన్ లైన్లకు తగినంత దూరంలో మాత్రమే మండపాలను నిర్మించాలి. మండపాల పైభాగం నుంచి విద్యుత్ వైర్లు వెళ్లకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.
  • వైరింగ్ పనులను తప్పనిసరిగా సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్లతోనే చేయించాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లు మాత్రమే వాడాలి.
  • వర్షాకాలం అయినందున విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు తడవకుండా షెడ్లు ఏర్పాటు చేయాలి. తడిసిన బోర్డులను లేదా విద్యుత్ పరికరాలను చేతులతో తాకకూడదు.
  • మండపాల వద్ద లైటింగ్, మైక్ సెట్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలకు, భక్తులకు అలాగే అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks