APPSC Forest Range Officer Notification : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు..?

ఈ ప్రకటన ద్వారా మొత్తం 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 పరిధిలో వేతన స్కేలు అమలులో ఉంటుంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి క్రింది విభాగాలలో ఏదో ఒక దానిలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
- అగ్రికల్చర్, వృక్షశాస్త్రం, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్
- ఇంజినీరింగ్ (అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్)
- ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్
- మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ
అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 16, 2026
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 5, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
- అధికారిక వెబ్ సైట్ - https://portal-psc.ap.gov.in/
ఈ ఉద్యోగాల ఎంపిక కోసం ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించరు. నేరుగా ఒకే దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం 600 మార్కులకు గాను ప్రశ్నలు ఉంటాయి.
- క్వాలిఫైయింగ్ టెస్ట్ (100 మార్కులు) : జనరల్ ఇంగ్లీష్ (50 మార్కులు), జనరల్ తెలుగు (50 మార్కులు)
- పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (150 మార్కులు)
- పేపర్-2: మ్యాథమెటిక్స్ (SSC స్టాండర్డ్ - 150 మార్కులు)
- పేపర్-3: జనరల్ ఫారెస్ట్రీ - I (150 మార్కులు)
- పేపర్-4: జనరల్ ఫారెస్ట్రీ - II (150 మార్కులు)

రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.