నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ముఖ్యమైన అప్డేట్ అందించింది. గ్రూప్-1తో పాటు వివిధ శాఖల్లోని పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబరు 11 వరకు పొడిగిస్తున్నట్లు కమిషన్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది.

వివిధ సాంకేతిక కారణాలు, వ్యక్తిగత వినతుల దృష్ట్యా దరఖాస్తు గడువును పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు వచ్చాయి. అభ్యర్థుల ఇబ్బందులను, వినతులను సానుకూలంగా పరిశీలించిన కమిషన్, వారందరికీ మరొక అవకాశం కల్పిస్తూ ఆన్లైన్ సబ్మిషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు గడువు పొడిగించిన వాటిలో గ్రూప్ 1 తో పాటు సహాయ పర్యావరణ ఇంజినీర్ , ఉద్యాన అధికారి, వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్-2 , సహాయ గిరిజన సంక్షేమ అధికారి,సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఉద్యోగ నోటిఫికేషన్లున్నాయి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుద్యోగులు గడువు తేదీ ముగిసేవరకు వేచి చూడకుండా, ఆఖరి నిమిషం వెబ్సైట్ ( https://portal-psc.ap.gov.in/ ) రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ సూచించింది.
యథావిధిగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష…
దరఖాస్తు గడువు పొడిగించినప్పటికీ, గ్రూప్-1 పోస్టులకు నిర్వహించబోయే ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన తేదీల ప్రకారమే ప్రిలిమ్స్ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రిపరేషన్ను వేగవంతం చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల విభాగాల్లో 166 పోస్టులను భర్తీ చేస్తారు.
గ్రూప్ 1 ఖాళీల వివరాలు…
- డిప్యూటీ కలెక్టర్లు : 12 పోస్టులు
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36
- డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
- జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
- రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ): 03
- జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
- డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02
- జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15
- డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీఓ): 35 పోస్టులు

గ్రూప్-1 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్ - ఆఫ్లైన్ OMR ఆధారిత), మెయిన్స్ పరీక్ష (డిస్క్రిప్టివ్ తరహా), ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.