APPSC Group 1 Application : ఏపీ గ్రూప్-1 దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ - వెంటనే అప్లై చేసుకోండి
APPSC Group 1 Application : ఏపీపీఎస్సీ గ్రూప్-1 రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 166 పోస్టులను భర్తీ చేస్తారు.
APPSC Group 1 Application : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 రిక్రూట్మెంట్ 2026 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 166 అత్యున్నత స్థాయి గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి నేడే చివరి తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషన్ సూచించింది.

ఆఖరి నిమిషంలో వెబ్సైట్ ( https://portal-psc.ap.gov.in ) పై తీవ్ర సర్వర్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, నిరుద్యోగ అభ్యర్థులు గడువు ముగిసేవరకు వేచి చూడకుండా తక్షణమే అప్లై చేయాలని అధికారులు స్పష్టం చేశారు. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, డీఈఓలు వంటి కీలక పరిపాలనా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
గ్రూప్-1 పోస్టులకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఏపీపీఎస్సీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన రాత పరీక్ష తేదీల ప్రకారమే ప్రిలిమ్స్ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తమ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేసుకోవాలని కమిషన్ కోరింది.
పోస్టుల వివరాలు - ఖాళీల సంఖ్య:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల కీలక ప్రభుత్వ విభాగాల్లో 166 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- డిప్యూటీ కలెక్టర్లు: 12 పోస్టులు
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36 పోస్టులు
- డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03 పోస్టులు
- జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు
- రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీఓ): 03 పోస్టులు
- జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు
- డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12 పోస్టులు
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02 పోస్టులు
- జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03 పోస్టులు
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15 పోస్టులు
- డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీఎల్డీఓ): 35 పోస్టులు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారుల వయస్సు పోస్టు స్వభావాన్ని బట్టి 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశల్లో పారదర్శకంగా జరుగుతుంది. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్ - ఆఫ్లైన్ OMR విధానంలో), రెండో దశలో మెయిన్స్ పరీక్ష (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఆ తర్వాత చివరి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. 2027 జనవరి 24న ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

