APPSC Forest Beat Officer Notification 2026: నిరుద్యోగ యువతకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త అందించింది. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
అక్టోబర్ 16 నుంచి అప్లికేషన్లు…
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు వేతన స్కేలు లభిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 05, 2026 (రాత్రి 11:59 గంటల వరకు) వరకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. దీనితో పాటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండటం తప్పనిసరి.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించకుండా…. కేవలం ఒకే దశలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBRT) ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి వాకింగ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం…
- క్వాలిఫైయింగ్ టెస్ట్ (డిస్క్రిప్టివ్) : ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూ భాషలో అడవులు, పర్యావరణం అంశంపై వ్యాసరూప ప్రశ్న (50 మార్కులు - 45 నిమిషాలు).
- పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ (100 మార్కులు - 100 నిమిషాలు - 100 ప్రశ్నలు).
- పేపర్-2: జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ - పదవ తరగతి స్థాయి (100 మార్కులు - 100 నిమిషాలు - 100 ప్రశ్నలు).
రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కుల కోత ఉంటుంది. దీనితో పాటు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కూడా నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. వయోపరిమితి, బ్రేక్-అప్ ఖాళీల వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 16న లేదా అంతకంటే ముందే వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.
{{/usCountry}}రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కుల కోత ఉంటుంది. దీనితో పాటు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) కూడా నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. వయోపరిమితి, బ్రేక్-అప్ ఖాళీల వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ అక్టోబర్ 16న లేదా అంతకంటే ముందే వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది.
{{/usCountry}}