APSRTC Dasara Special Buses 2026 : దసరా పండుగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. పండుగ సీజన్‌లో ఊహించిన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5,000 కంటే ఎక్కువ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రయాణికులు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు, తిరిగి వచ్చేందుకు వీలుగా ఈసారి దసరా-2026 ఉత్సవాల కోసం మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులను నడపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం పండగ ముందు, పండుగ తర్వాత అని రెండు విడతలుగా ఈ ప్రత్యేక బస్సుల ఆపరేషన్లను విభజించారు. దసరా ముందు రోజుల్లో అక్టోబర్ 16 నుంచి 19వ తేదీ వరకు ప్రజలు తమ స్వగ్రామాలకు, పుణ్యక్షేత్రాలకు చేరుకోవడానికి మొదటి విడత బస్సులను నడుపుతారు. ఆ తర్వాత పండుగ ముగిశాక అక్టోబర్ 20 నుంచి 25వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం రెండో విడత ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేయనున్నారు.
అత్యధికంగా హైదరాబాద్ నుంచే….
ఈ ప్రత్యేక సర్వీసుల్లో అత్యధిక బస్సులను హైదరాబాద్ నగరం నుంచి నడపనున్నారు . హైదరాబాద్ నుంచి ఏకంగా 1,186 ప్రత్యేక బస్సులను కేటాయించారు. దీని తర్వాత విజయవాడ నుంచి 1,053 బస్సులు, బెంగళూరు నుంచి 475 బస్సులు, విశాఖపట్నం నుంచి 440 బస్సులు మరియు ఇతర రూట్లలో 1,360 బస్సులను నడపనున్నారు.
పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణం సురక్షితంగా సాగేలా అన్ని బస్ డిపోల్లోనూ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియోగిస్తున్నట్లు రవాణా సంస్థ తెలిపింది. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని తమ ప్రయాణాలను సుఖమయం చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణం సురక్షితంగా సాగేలా అన్ని బస్ డిపోల్లోనూ ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియోగిస్తున్నట్లు రవాణా సంస్థ తెలిపింది. ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుని తమ ప్రయాణాలను సుఖమయం చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}