...
...
Next Story

ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 14 పుణ్యక్షేత్రాల దర్శనం.. లిస్టులో అరుణాచలం, రామేశ్వరం!

APSRTC Tour Package : ఏపీఎస్ఆర్టీసీ పలు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా 14 పుణ్యక్షేత్రాలకు బడ్జెట్ ధరలో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. చాలా ఆలయాలు ఈ టూర్‌లో దర్శించుకోవచ్చు.

Published on: Mar 14, 2026, 16:28:42 IST
Advertisement

మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన ఆలయాలు సందర్శించి రావాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. 14 పుణ్యక్షేత్రాల దర్శనం చేయించనుంది. అంతేకాదు ఈ లిస్టులో లిస్టులో అరుణాచలం, రామేశ్వరంవంటి ఆలయాలను దర్శనం చేసుకోవచ్చు.

ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ

కోనసీమ జిల్లాలోని రావులపాలెం డిపో నుంచి ఈ టూర్ మెుదలవుతుంది. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తారు. టీవీ సౌకర్యం కూడా ఉంటుంది.

ఈ యాత్రలో దర్శించుకునే ఆలయాలు ఇవే

  • కాంచీపురం : శ్రీ కామాక్షిదేవి శక్తిపీఠం
  • అరుణాచలం :శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం
  • పళని : శ్రీ సుప్రహ్మణ్యేశ్వరస్వామి
  • కోయంబత్తూర్ : శ్రీఆదియోగి(ఇషా)
  • గురువాయర్ : శ్రీకృష్ణ ఆలయం
  • త్రివేండ్రం : శ్రీఅనంతపద్మనాభ స్వామి
  • మధురై : శ్రీ మధురమీనాక్షి ఆలయం
  • శ్రీవిల్లిపుత్తూరు : శ్రీ గోదాదేవి ఆలయం
  • కుర్తాళం : శ్రీ కుట్రాళేశ్వరుడు శివుడు
  • టెంకాశి : శ్రీకాశి విశ్వశ్వరుడు
  • రామేశ్వరం : శ్రీరామేశ్వర జ్యోతి లింగం
  • శ్రీరంగం : శ్రీరంగనాథ ఆలయం
  • తంజావూరు : శ్రీబృహదేశ్వర ఆలయం
  • కుంభకోణం : శ్రీ విష్ణుదేవుడు, నవగ్రహదేవాలయం

టూర్ ప్యాకేజీ ఎంత?

ఈ టూర్ 20-03-2026 నుంచి 28-03-2026 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. మెుత్తం 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఉదయం అల్పహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పహారం అందిస్తారు. టికెట్ ఛార్జీ రూ.9900గా నిర్ణయించారు. ఒకవేళ రూమ్స్ తీసుకుంటే ఛార్జీలు అదనం అని గమనించాలి.

మరిన్ని వివరాలకు, టికెట్ల కోసం అస్టిసెంట్ మేనేజర్ : 7382911871, టీసీహెచ్‌వీబీ రావు : 7382912400, ఆర్ఎస్ రావు : 7382912398, రావులపాలెం ఆర్టీసీ ఎంక్వాయిరీ : 9959225549.

'APSRTC రావులపాలెం డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ యాత్ర సర్వీసు. భక్తుల కోసం అరుణాచలం, రామేశ్వరం, మధురై, కాంచీపురం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు మొత్తం 14 ప్రసిద్ధ ఆలయాల దర్శనం కలిగిన ప్రత్యేక యాత్ర సర్వీసును నిర్వహించబడుతోంది.' అని ఆర్టీసీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe