ఆ రింగ్ రోడ్డు పనులు 80 శాతం పూర్తి.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి

Banaganapalle Ring Road : బనగానపల్లె రింగ్ రోడ్డు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే జనాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: Sep 20, 2026, 18:34:23 IST
By , Banaganapalle
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్ధన రెడ్డి తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 20, 2026) వర్షంలో సైతం మంత్రి జనార్ధన రెడ్డి అధికారులతో కలిసి బనగానపల్లె రింగ్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. సాయిబాబా ఆలయం నుండి రవ్వలకొండ వరకు సాగుతున్న పనులను ఆయన స్వయంగా చూసి, పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రింగ్ రోడ్డు నిర్మాణ పనులలో ఇప్పటికే సుమారు 80 శాతం పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. రూ.56 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 10.68 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి జనార్ధన రెడ్డి పేర్కొన్నారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే బనగానపల్లె పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి జనార్ధన రెడ్డి అన్నారు. భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రావడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రజల రాకపోకలు ఎంతో సులభతరం అవుతాయని ఆయన నొక్కి చెప్పారు.

మంత్రి బనగానపల్లె పట్టణంలోని ప్రధాన కూడళ్లను కూడా పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీకి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించే వ్యూహాలపై చర్చించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. బనగానపల్లె పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.

రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణానికి మెరుగైన రహదారి అనుసంధానం లభించడమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణ కూడా సులభతరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

'బనగానపల్లె రింగ్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను. సాయిబాబా ఆలయం నుంచి రవ్వలకొండ వరకు కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నాను. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. రూ.56 కోట్ల అంచనా వ్యయంతో 10.68 కి.మీ. పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పూర్తయితే బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.' అని మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More