ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరటి పండ్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణం పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో మూడు నెలలు ధరలు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్‌లో ధరలు క్వింటాలుకు రూ.2,000-రూ.3,000 వరకు పడిపోయినప్పుడు రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రైతులకు ఈ పదునైన రికవరీ అవసరమైన ఉపశమనం కలిగించింది. ధరలు టన్నుకు రూ.25,000 కు పెరిగాయి.

ఈ-క్రాప్ డేటా ప్రకారం కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో అరటి సాగు అత్యధికంగా ఉంది. 13,820 హెక్టార్లలో పంట సాగు చేశారు. రైతులు సాధారణంగా ఎకరానికి దాదాపు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడతారు. దిగుబడి 15 నుండి 20 టన్నుల మధ్య ఉంటుంది.
కాలానుగుణ పంటల మాదిరిగా కాకుండా, అరటిపండ్లను ఏడాది పొడవునా పండిస్తారు. అయితే చాలా మంది రైతులు సాంప్రదాయకంగా డిమాండ్ ఎక్కువగా ఉండే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పంటలను కోసుకుంటారు. పులివెందుల అరటిపండ్లు ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రైతులు, వ్యాపారులు ఈ పండ్లు రుచి, నాణ్యత, నిల్వలో విభిన్నంగా ఉంటాయని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అరటిపండ్లు 8-10 రోజులు తాజాగా ఉంటాయి. పులివెందుల నుండి వచ్చినవి 12-14 రోజులు తాజాగా ఉంటాయట. దీనికి కారణం కొద్దిగా ఉప్పు నేల, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అని అంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ పెరగడంతో పాటు, విదేశాల నుండి ఆర్డర్లు పెరగడంతో సాగు ఖర్చులను తగ్గించుకున్న తర్వాత చివరకు మంచి రాబడిని పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.
ఇక అనంతపురం జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది. కొన్ని రోజుల కిందట పడిపోయిన ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ధర రూ.25 వేలు టన్నుకు ఉంది. అనంతపురం జిల్లాలోని అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
{{/usCountry}}ఇక అనంతపురం జిల్లాలో 7,250 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పంట బాగా పండితే జిల్లా వ్యాప్తంగా 1,88,500 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది. కొన్ని రోజుల కిందట పడిపోయిన ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ధర రూ.25 వేలు టన్నుకు ఉంది. అనంతపురం జిల్లాలోని అరటిని ఢిల్లీ, కోల్‌కతా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.
{{/usCountry}}కిందటి నెల వరకూ అరటి గెల రూ.200 నుంచి రూ.300 వరకు పలికింది. కానీ ఇప్పుడు ఒక గెల రూ.700 నుంచి రూ.1000 దాకా మార్కెట్లో పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో డజను అరటి పండ్లు రూ.70 నుంచి 100 మధ్యలో అమ్ముతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో అరటి పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు డిమాండ్ కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వ్యాపార పరిస్థితుల కారణంగా అరటి ఉత్పత్తి సరిగా జరగలేదు. దీంతో రైతుల నుంచి మార్కెట్‌లోకి వచ్చే సరఫరా తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి.
ఏప్రిల్ వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. మ్యాంగో సీజన్ మెుదలైతే.. అరటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మామిడి సీజన్ స్టార్ట్ అవుతుంది. మ్యాంగో మార్కెట్లోకి వస్తే అరటి పండ్ల ధరలు తగ్గుతాయి. గోదావరి జిల్లాల్లో అరటిసాగు ఎక్కువగానే ఉంటుంది. కానీ నష్టాల కారణంగా అరటి సాగును రైతులు చాలా వరకు తగ్గించారు. దీంతో వ్యాపారులు సైతం పెద్ద మెుత్తంలో డబ్బులు చెల్లించి గెలలను కొంటున్నారు. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో అరటి ధరలు పెరిగాయి.