మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. మార్చి 20న రాష్ట్ర బడ్జెట్‌

మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

Updated on: Feb 23, 2026, 22:18:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్చి 16 నుండి మార్చి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. మార్చి 16న రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 20న అసెంబ్లీలో సమర్పించనున్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక ఆర్థిక ప్రాధాన్యతలు, విధానపరమైన కార్యక్రమాలు, శాసనసభ వ్యవహారాలపై దృష్టి సారించనుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 17, 18 తేదీలలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఉగాది మార్చి 19న వస్తున్నందున ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అయితే రంజాన్‌ను అదే రోజున జరుపుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాధారణ సెలవుల జాబితా ప్రకారం, రంజాన్ మార్చి 21న జరగాల్సి ఉంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

దాదాపు ఆరు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ సమావేశంలో ములుగు జిల్లాలోని గుమ్మడూరులో జేఎన్‌టీయూ కళాశాల నిర్మాణం కోసం 70 ఎకరాలు కేటాయించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి 20 ఎకరాలు కేటాయించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదించింది.

ఇక ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మార్చి 13వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ టేకోవర్ మెుత్తం విలువ సుమారు రూ.15000 కోట్లుగా అంచనా. మెట్రోపే ఉన్న అప్పులు రూ.13000 కోట్లు కాగా. ఎల్అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2000 కోట్లుగా ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More